IPL 2026: కప్పు తెచ్చిన కలవరం.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిషేధం.. కఠిన నిర్ణయం దిశగా బీసీసీఐ?

RCB, Bengaluru Stampede: ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి ట్రోఫీని గెలుచుకుంది. ఈ భారీ విజయం తర్వాత రోజు, జూన్ 4న బెంగళూరులోని విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియంలో RCB విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం సమీపంలో 11 మంది మరణించారు. ఈ విషయాన్ని ఇప్పుడు BCCI తీవ్రంగా పరిగణిస్తోంది.

IPL 2026: కప్పు తెచ్చిన కలవరం.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ నిషేధం.. కఠిన నిర్ణయం దిశగా బీసీసీఐ?
No sale of RCB, Clarifies United Spirits: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ ఫ్రాంచైజీని అమ్ముతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ఖండించింది. RCB జట్టును అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధం, ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. RCB యజమాని యునైటెడ్ స్పిరిట్స్ ఒక పత్రికా ప్రకటన ద్వారా జట్టును అమ్మడం లేదంటూ స్పష్టం చేసింది.

Updated on: Jun 09, 2025 | 6:29 PM

Royal Challengers Bengaluru: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, 2026 సీజన్‌కు దూరమయ్యే ప్రమాదంలో ఉందా? ఈ ప్రశ్న ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో, ఆర్‌సీబీ అభిమానులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అందులో భాగంగా జట్టుపై నిషేధం విధించే యోచనలో ఉందని పలు నివేదికలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి.

విషాదానికి దారితీసిన విజయోత్సవం..

ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆనందంలో, ఆర్‌సీబీ యాజమాన్యం బెంగళూరులో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. అయితే, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, 11 మంది అభిమానులు మృతి చెందడం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దురదృష్టకర సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు, ఆర్‌సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆర్‌సీబీకి చెందిన ఒక ఉన్నతాధికారిని అరెస్టు చేయగా, కేఎస్‌సీఎకు చెందిన ఇద్దరు అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

నిషేధంపై ఉత్కంఠ..

ఈ తీవ్రమైన సంఘటనను బీసీసీఐ సుమోటోగా స్వీకరించింది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ, “ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇది ఫ్రాంచైజీ నిర్వహించిన ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ, భారతదేశంలో క్రికెట్‌కు బీసీసీఐ బాధ్యత వహిస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు మేం మౌన ప్రేక్షకుల్లా ఉండలేం. ఏదో ఒక దశలో కచ్చితంగా చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.

బీసీసీఐ ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, ఆర్‌సీబీపై కఠిన చర్యలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆర్‌సీబీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేలితే, జట్టుపై ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పలు జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం విధించిన ఉదంతాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

అధికారికంగా ఎలాంటి నిర్ణయం రాలేదు..

అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిషేధం అనేది కేవలం ఊహాగానాల దశలోనే ఉంది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దాని నివేదిక ఆధారంగానే బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టమవుతోంది.

ఈ మొత్తం వ్యవహారం ఆర్‌సిబి అభిమానులను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించి, కప్పు గెలిచిన ఆనందం ఆవిరికాకముందే, జట్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకోవడం వారిని కలవరపరుస్తోంది. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..