BCCI Legends League: మరో కొత్త లీగ్ దిశగా బీసీసీఐ అడుగులు.. రంగంలోకి రిటైర్డ్ ప్లేయర్లు..!

|

Aug 14, 2024 | 2:30 PM

BCCI May Launch New Legends League: భారతదేశంలో అనేక రకాల క్రికెట్ లీగ్‌లు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ఐపీఎల్. బీసీసీఐ ఖజానాను ఏటా రెట్టింపు చేయడంలో ఐపీఎల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఈ లాభాలను మరింత పెంచాలనే ఉద్దేశంతో బీసీసీఐ కొత్త లీగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ కొత్త లీగ్ కాస్త డిఫరెంట్‌గా ఈ లీగ్‌లో రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నట్టు సమాచారం.

BCCI Legends League: మరో కొత్త లీగ్ దిశగా బీసీసీఐ అడుగులు.. రంగంలోకి రిటైర్డ్ ప్లేయర్లు..!
Bcci Legends League
Follow us on

BCCI May Launch New Legends League: భారతదేశంలో క్రికెట్ ఆటకు ఎంతలా పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే భారతదేశంలో అనేక రకాల క్రికెట్ లీగ్‌లు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ఐపీఎల్. బీసీసీఐ ఖజానాను ఏటా రెట్టింపు చేయడంలో ఐపీఎల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఈ లాభాలను మరింత పెంచాలనే ఉద్దేశంతో బీసీసీఐ కొత్త లీగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ కొత్త లీగ్ కాస్త డిఫరెంట్‌గా ఈ లీగ్‌లో రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నట్టు సమాచారం.

బీసీసీఐకి ప్రతిపాదన..

మీడియా నివేదికల ప్రకారం, రిటైర్డ్ క్రికెటర్ల కోసం కొత్త లీగ్‌ను ప్రారంభించాలని చాలా మంది మాజీ ఆటగాళ్లు జై షాకు ప్రతిపాదించారు. దీనిపై బీసీసీఐ కూడా ఆసక్తి కనబరుస్తూ కసరత్తు ప్రారంభించింది. అలాగే, మాజీ క్రికెటర్ బీసీసీఐకి అలాంటి ప్రతిపాదన ఇచ్చాడని, దానిని పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ అధికారిని ఉటంకిస్తూ మీడియా పేర్కొంది.

మళ్లీ రంగంలోకి దిగ్గజాలు?

ప్రస్తుతం, మాజీ క్రికెటర్లు ఆడుతున్న అనేక లీగ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, యూసుఫ్ పఠాన్, క్రిస్ గేల్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తదితర ఆటగాళ్లు ఇలాంటి లీగ్‌లలో భాగమే. వీటిలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు బీసీసీఐ కూడా ఇలాగే కొత్త లీగ్ ప్రారంభిస్తే మాజీ క్రికెటర్ల జాతకం మళ్లీ మారుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే బీసీసీఐ నిర్వహించిన లీగ్‌లు ఏవీ ఇప్పటివరకు విఫలం కాలేదు.

ఈ లీగ్ ప్రారంభమైతే, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, క్రిస్ గేల్, హర్భజన్ సింగ్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు మళ్లీ మైదానంలో సందడి చేయడం చూడవచ్చు. ఈ లీగ్ పూర్తిగా ఐపీఎల్ పద్ధతిలో జరుగుతుందని, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన, ఐపీఎల్‌లో ఆడని ఆటగాళ్లు మాత్రమే ఈ లీగ్‌లో ఆడతారని చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..