BCCI Meeting: బీసీసీఐ ఎమర్జెన్సీ మీటింగ్.. రేపు తేలనున్న రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ భవితవ్యం

BCCI Meeting: బీసీసీఐ ముంబైలో నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ప్రణాళికలు, గంభీర్, అగార్కర్ భవిష్యత్తుపై సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. భారత క్రికెట్ భవిష్యత్తును మార్చే అనేక సంచలన నిర్ణయాలకు ఈ బీసీసీఐ సమావేశం వేదిక కానుంది. 

BCCI Meeting: బీసీసీఐ ఎమర్జెన్సీ మీటింగ్.. రేపు తేలనున్న  రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ భవితవ్యం
Rohit Sharma

Updated on: Sep 02, 2026 | 7:11 PM

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు బోర్డు అగ్రశ్రేణి అధికారులు హాజరుకానున్నారు. అందరూ బుధవారం రాత్రికే ముంబై చేరుకున్నారు. ఆయా పర్యటనల్లో జట్టు ప్రదర్శించిన వైఫల్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై బోర్డు పెద్దలు పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నారు.

రోహిత్ శర్మ భవిష్యత్తుపై తేలనున్న నిర్ణయం

ఈ సమావేశంలో అందరి దృష్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పైనే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేదంటూ ప్రచారంలో ఉన్న కథనాలపై బోర్డు ఒక స్పష్టతకు రానుంది. రోహిత్‌ను జట్టులో కొనసాగించాలా లేక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాడిని తీర్చిదిద్దాలా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వయసు, ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ భవిష్యత్తు పై ఒక కీలక రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది.

విదేశీ పర్యటనల ఓటములపై సీరియస్ రివ్యూ

ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్ ఓటములతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ పరాజయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉన్నప్పటికీ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు సిరీస్‌లు గెలిచినప్పటికీ విదేశీ గడ్డపై ఎదురైన ప్రతికూల ఫలితాలకు గల కారణాలను గంభీర్, అగార్కర్ వివరించాల్సి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు గట్టి నిలదీతలకు సిద్ధమైంది.

గాయాల సమస్యలు, భవిష్యత్తు సిరీస్‌లపై దృష్టి

హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆటగాళ్ల గాయాల సమస్యలు బోర్డును ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే న్యూజిలాండ్ బహుళ ఫార్మాట్ల పర్యటన, స్వదేశంలో జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, 2027 పురుషుల వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బాధ్యతలపై కూడా ఈ భేటీలో చర్చ నడిచే సూచనలు కనిపిస్తున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us