భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ఆరోపణలపై బీసీసీఐలోనూ, ఆటగాళ్లలోనూ అందోళనలు మొదలయ్యాయి. గాయపడిన చాలా మంది భారత ఆటగాళ్లు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ ఆరోపించారు. ఇటీవలే మళ్లీ నియమితులైన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఓ ప్రైవేట్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు వెల్లడించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో, చేతన్ శర్మ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆటగాళ్లకు జట్టు నుంచి తొలగిస్తారేమోననే భయం గురించి కూడా చెప్పుకొచ్చాడు.
గత ఒకటి, రెండేళ్లుగా భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల ఫిట్‌నెస్ చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా గత సంవత్సరంలో, టీమిండియాలో చాలా మంది సీనియర్ నుంచి కొత్త ఆటగాళ్లు గాయపడటం, దీని కారణంగా చాలా మ్యాచ్‌లు మిస్ అయిన సంగతి తెలిసిందే. జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా కొందరు ఆటగాళ్లు గాయాలపాలవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఎందుకు తక్కువగా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా చేతన్ శర్మ ఒక ప్రైవేట్ ఛానెల్ స్టింగ్‌లో ఈ ఆరోపణలను వెల్లడించాడు.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..