Team India: వెస్టిండీస్‌కి అజిత్‌ అగార్కర్‌ పయనం.. ఆ సిరీస్ నుంచి సీనియర్ ప్లేయర్లను తప్పించేందుకే..?

|

Jul 17, 2023 | 10:28 AM

IND vs WI 2nd Test: వెస్టిండీస్‌పై డొమినికా టెస్టులో విజయం సాధించిన టీమిండియా విజయోత్సాహంతో ఉంది. అలాగే రెండు టెస్టుల సిరీస్‌లో కూడా 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ ట్రినిటాడ్ వేదికగా ఈ నెల 20 నుంచి..

Team India: వెస్టిండీస్‌కి అజిత్‌ అగార్కర్‌ పయనం.. ఆ సిరీస్ నుంచి సీనియర్ ప్లేయర్లను తప్పించేందుకే..?
Ajit Agarkar; IND vs WI 2nd test
Follow us on

IND vs WI 2nd Test: వెస్టిండీస్‌పై డొమినికా టెస్టులో విజయం సాధించిన టీమిండియా విజయోత్సాహంతో ఉంది. అలాగే రెండు టెస్టుల సిరీస్‌లో కూడా 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ ట్రినిటాడ్ వేదికగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆ మ్యాచ్ కంటే ముందే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఇటీవలే నియమితుడైన మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ట్రినిటాడ్ వెళ్లి, టీమిండియాతో సంభాషించనున్నాడు.

సెలెక్షన్ టీమ్ ఛీఫ్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే అగార్కర్.. ఆసీయా క్రిడల కోసం చైనా వెళ్లే భారత జట్టును ప్రకటించాడు. ఈ క్రమంలోనే రానున్న ఐర్లాండ్ సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో సంభాషించనున్నాడు. ఐర్లాండ్ సిరీస్ ఆడే ఆటగాళ్లను ఫైనలైజ్ చేయడమే ఈ సంభాషణకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రిజర్వ్ ప్రేయర్లను ఐర్లాండ్ పర్యటనకు పంపి, సీనియర్ ఆటగాళ్లను ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కోసం సన్నద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆసియా కప్, ముఖ్యంగా ప్రపంచకప్‌కి ముందన్న షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లను గాయాలు వెంటాడే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే సినీయర్ ఆటగాళ్లకు ఐర్లాండ్ సిరీస్ నుంచి దూరంగా ఉంచాలని అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ టీమ్ ఆలోచిస్తుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా.. ఆతిథ్య కరేబియన్ జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ పర్యటన జూలై 12న ప్రారంభమవగా ఆగస్ట్ 13 వరకు కొనసాగుతుంది. అలాగే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టీమిండియా ఐర్లాండ్‌లో ఆ దేశ జట్టుతో 3 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), కెఎస్ భరత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..