Akash Chopra : బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసురుతున్న బౌలర్లు.. టీ20 క్రికెట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన..

Akash Chopra Coments: టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ మ్యాచులను గెలిపిస్తే బౌలర్లు టోర్నీలను గెలిపిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇండియాన్

Akash Chopra : బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసురుతున్న బౌలర్లు.. టీ20 క్రికెట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన..

Updated on: Jan 26, 2021 | 5:21 AM

Akash Chopra Coments: టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ మ్యాచులను గెలిపిస్తే బౌలర్లు టోర్నీలను గెలిపిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇండియాన్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. దశాబ్ద కాలంగా టీ 20 క్రికెట్ బాగా డెవలప్ అయిందని పేర్కొన్నాడు. తన దృష్టిలో టీ 20లో నలుగురు బెస్ట్ బౌలర్లుగా చెప్పాడు. ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏటా బౌలర్ల వ్యూహంతోనే బరిలోకి దిగుతోందని గుర్తు చేశాడు. ఆరుగురు బౌలర్లతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పాడు. అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తన దృష్టిలో నంబర్‌ వన్‌ బౌలర్ అన్నాడు. లసిత్‌ మలింగ, సునిల్‌ నరైన్‌, జస్ప్రీత్‌ బుమ్రా మిగిలిన బౌలర్లుగా చెప్పాడు.

మలింగ టీ20 క్రికెట్లో రాక్‌స్టార్‌‌గా నిలిచాడన్నాడు. ప్రస్తుతం అతడి కెరీర్‌ కాస్త మందకొడిగా సాగుతున్నా ఒకప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్నాడని కితాబిచ్చాడు. ఇక సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమన్నాడు. ఓవర్లకు ఓవర్లు మెయిడిన్‌ చేయగల సత్తా ఉన్న బౌలరని పొగిడాడు. రషీద్‌ ఖాన్‌ గత దశాబ్దం ప్రథమార్ధంలో ఆడకున్నా రెండో భాగంలో ఆధిపత్యం చెలాయించాడని చెప్పాడు. మ్యాచు సందర్భాన్ని బట్టి ఎప్పుడు దూస్రా వేస్తాడో, ఎప్పుడు లెగ్‌స్పిన్‌ వేస్తాడో తెలియదన్నాడు. ఇక టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ ఆడటం చాలా కష్టమని అతడు విసిరే యార్కర్లు ఎంతో కఠినంగా ఉంటాయని ప్రశంసించాడు.