
India vs Bangladesh, Super Fours, 16th Match: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ తమ జట్టులో మునుపటి మ్యాచ్ నుంచి నాలుగు మార్పులు చేసింది.
బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ గాయం కారణంగా ఆడటం లేదు. అతని స్థానంలో జకీర్ అలీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ రౌండ్ తొలి మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈరోజు గెలిస్తే ఫైనల్‌కు చేరుకునే ఆ జట్టు మార్గం సులభవుతుంది.
బంగ్లాదేశ్ తన తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించింది. భారత్‌ను ఓడించగలిగితే, వారు ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్.
Asia Cup 2025. INDIA XI: A. Sharma, S. Gill, S. Yadav (c), T. Varma, S. Samson (wk), S. Dube, H. Pandya, A. Patel, K. Yadav, V. Chakaravarthy, J. Bumrah. https://t.co/bubtcR19RS #INDvBAN #AsiaCup2025 #Super4
— BCCI (@BCCI) September 24, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..