Allu Arjun’s Pushpa: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్(shakib al hasan) టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చిత్రం ‘పుష్ప: ది రైజింగ్’(Pushpa)లోని సన్నివేశాలు స్టెప్పులతో డేవిడ్ వార్నర్ , డ్వేన్ బ్రావో , సురేష్ రైనా లిస్టులో చేరాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో శ్రీవల్లి సాంగ్‌తోపాటు, పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ హాట్ ఫేవరెట్‌గా మారింది. ప్రస్తుతం ఈ లిస్టులో షకీబ్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మరో ప్రసిద్ధ సన్నివేశాన్నికి వైరైటీగా కాపీ చేయాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League) మ్యాచ్‌లో షకీబ్ తన చేతిని గడ్డం మీదుగా తిప్పుతూ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ ఐకానిక్ మూమెంట్‌ను ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకరైన షకీబ్, కొమిల్లా విక్టోరియన్స్ వర్సెస్ ఫార్చ్యూన్ బరిషల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను అవుట్ చేసిన తర్వాత ఈ మూమెంట్‌ను ప్రదర్శించాడు.
ఫార్చ్యూన్ బరిషల్ కెప్టెన్ కొమిల్లా, డు ప్లెసిస్‌ను కొట్టిన బంతని క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆరో ఓవర్‌లో షకీబ్ వేసిన ఓ బంతిని డు ప్లెసిస్ లాంగ్ ఆన్ దిశగా కొట్టాడు. అనంతరం ఫార్య్చూన్ బరిషల్ సారథి అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో డుప్లెసిస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో షకీబ్ ‘పుష్ప’ సినిమా నుంచి అల్లు అర్జున్ మేనరిజానికి తనస్టైల్ టచ్ ఇచ్చాడు.
దీంతో షకీబ్ సహచరులు డ్వేన్ బ్రావో, నజ్ముల్ ఇస్లాం కూడా సినిమా నుంచి స్టెప్పులు వేస్తూ కనిపించారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ అయితే వికెట్ పడగొట్టడానే ‘పుష్ప రాజ్ నడకను’ కాపీ చేశాడు. అయితే మ్యాచ్ బరిషల్ అనుకున్నట్లుగా సాగలేదు. 63 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్రావో మూడు వికెట్లు పడగొట్టి, షకీబ్ బంతితో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన కొమిల్లా 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 35 బంతుల్లో 48 పరుగులతో రాణించాడు. చివర్లో కరీం జనత్ మూడు సిక్సరతో రాణించడంతో కొమిల్లా ఇన్నింగ్స్ 158 పరుగుల వద్ద ముగిసింది. నజ్ముల్ హొస్సేన్ (47 బంతుల్లో 36) మినహా వారి బ్యాటర్లలో ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.బరిషల్ మొదటి నుండే ఛేజింగ్‌లో తడబడింది. దీంతో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది.
After Nazmul Islam, then @DJBravo47, and now the Bangladeshi ? @Sah75official displaying the #Pushpa move! ?
The @alluarjun movie has really taken over the #BBPL2022. ?
? Catch these antics for just ₹5, LIVE on #FanCode ? https://t.co/lr5xUr0sLW#BPLonFanCode #alluarjun pic.twitter.com/9TAn8xqksr
— FanCode (@FanCode) January 26, 2022
IND VS WI: ఈ ఐదుగురికి గోల్డెన్ ఛాన్స్.. వెస్టిండీస్‌తో సత్తా చాటితే ఇక తిరుగుండదన్న మాజీలు..!