బంగ్లాపై సిరీస్ కోల్పోయామన్న బాధతోనో, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి వెల్లువెత్తిన విమర్శలో నామమాత్రమైన ఆఖరి వన్డేలో టీమిండియా జూలు విదిల్చింది. చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత ఆటగాళ్లు బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగారు. ముందుగా ఇషాన్ కిషన్ (210)డబుల్ సెంచరీతో విరవిహారం చేయగా ఆతర్వాత విరాట్ కోహ్లీ (113) కూడా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి దూకుడు చూస్తుంటే టీమిండియా అలవోకగా 450 పరుగులు సాధిస్తుందని భావించారు. అయితే ఇషాన్, కోహ్లీలు వెంటనే వెనుదిరగడం, ఇతర ఆటగాళ్లు పెద్దగా పరుగులు చేయకపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా . ఆఖరులో వాషింగ్టన్ సుందర్ (37), అక్షర్ పటేల్ (20) ఫర్వాలేదనిపించారు.
ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ (3), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (8) విఫలమయ్యారు. కాగా వన్డేల్లో టీమ్‌ఇండియాకు ఇది నాలుగో అత్యధిక స్కోరు. ఇంతకుముందు వెస్టిండీస్‌పై 418, శ్రీలంకపై 414, బెర్ముడాపై 413 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 2, షకిబ్ 2, ఎబాడట్ 2.. ముస్తాఫిజర్, మెహిదీ చెరొక వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. మెహిదీ హసన్ మిరాజ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ ధావన్ (3) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆతర్వాత ఇషాన్‌తో కోహ్లీ జతకలిశాడు. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వర్షం కురిపించారు. ఈక్రమంలోనే ఇషాన్ ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లో 24 ఫోర్లు, 9 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. ఆతర్వాత కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 290 పరుగులు జోడించడం విశేషం. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నిరాశపరచడంతో భారత్ కేవలం 409 రన్స్‌కే పరిమితమైంది.
Innings Break!
Sensational batting display from #TeamIndia ? ?
A cracking 210 for @ishankishan51 ⚡️
A fine 113 for @imVkohli ?
Scorecard ? https://t.co/HGnEqtZJsM#BANvIND pic.twitter.com/UhTce3aHu4
— BCCI (@BCCI) December 10, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..