పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం రివేంజ్ తీర్చుకున్నాడు. టీ20 క్రికెట్‌లో మునుపెన్నడూ చూడని, ఆటతో రెచ్చిపోయాడు. పీఎస్‌ఎల్ 8వ సీజన్‌లో ఫిబ్రవరి 14న జరిగిన మ్యాచ్‌లో అతని భీకర ఫామ్ కనిపించింది. మ్యాచ్‌కు ముందు తనను అవమానించిన బౌలర్‌పై మ్యాచ్‌లో తన ప్రతాపాన్ని చూపించాడు. మ్యాచ్‌కు ముందు ఒక ఇంటర్వ్యూలో, పాకిస్థాన్ వెటరన్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. బాబర్‌ను తన దృష్టిలో 11వ నంబర్ బ్యాట్స్‌మెన్ అంటూ కామెంట్స్ చేశాడు. బాబర్ బ్యాటింగ్ చూస్తుంటే చాలా దారుణంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో అవకాశం కోసం ఎదురుచూసిన బాబర్.. పీఎస్‌ఎల్ మ్యాచ్‌లో బ్యాట్‌తో బ్యాండ్ బజాయించాడు. దీంతో అమీర్ బౌలింగ్ ఎకానమీ రేట్ మొత్తం చెడిపోయింది. అతనికి వికెట్ దక్కలేదు. పరుగులు మాత్రం భారీగా అందించాడు.
Making our day already is @babarazam258! #HBLPSL8 I #SabSitarayHumaray l #KKvPZ pic.twitter.com/S4M44ttcj0
— PakistanSuperLeague (@thePSLt20) February 14, 2023
పెషావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ జట్లు తలపడ్డాయి. కానీ, కరాచీ పిచ్‌లో మాత్రం బాబర్ ఆజం వర్సెస్ మహ్మద్ అమీర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అమీర్‌పై సత్తా చాటిన బాబర్.. బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో పెషావర్ జట్టు కరాచీ కింగ్స్‌ను ఓడించింది. అమీర్ కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. పెషావర్ జల్మీకి బాబర్ కెప్టెన్.
ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 68 పరుగులు చేసిన బాబర్ అజామ్.. 10కి పైబడిన ఎకానమీతో 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయిన రీతిలో మహ్మద్ అమీర్‌ను ఓడించాడు. 11వ నంబర్ బ్యాట్స్‌మెన్‌తో పోల్చడంతో రెచ్చిపోయిన బాబర్.. అమీర్ దారుణమైన స్థితికి కారణమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..