CSK vs MI: వామ్మో ఇదేం కొట్టుడు బ్రో.. ముంబైని వణికించిన 17 ఏళ్ల కొత్త కుర్రాడు! సీఎస్‌కేకు పవర్‌ హిట్టర్‌ దొరికేశాడుగా..

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే కొత్త ఆటగాడు ఆయుష్ మాత్రే అద్భుత ప్రదర్శన చేశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 15 బంతుల్లో 32 పరుగులు సాధించి, 213 స్ట్రైక్ రేటుతో అందరినీ ఆకట్టుకున్నాడు. వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సీఎస్కేకు ఇది కొత్త ఆశను నింపింది.

CSK vs MI: వామ్మో ఇదేం కొట్టుడు బ్రో.. ముంబైని వణికించిన 17 ఏళ్ల కొత్త కుర్రాడు! సీఎస్‌కేకు పవర్‌ హిట్టర్‌ దొరికేశాడుగా..
Ayush Mhatre

Updated on: Apr 20, 2025 | 8:21 PM

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం ముంబైలోని వాఖండే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే కొత్త కుర్రాడు అదరగొట్టాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతూ.. ఏ మాత్రం భయం లేకుండా భారీ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో వరుస ఓటముల ఇబ్బంది పడుతున్న సీఎస్‌కే.. ఇక లాభం లేదని కుర్రాళ్లకు అవకాశం ఇస్తోంది. గత మ్యాచ్‌లో మన గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌కు ఛాన్స్‌ ఇచ్చిన ధోని, ఇప్పుడు ముంబై మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే అనే కుర్రాడికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఇచ్చాడు. అతను వచ్చీ రావడంతోనే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అశ్విని బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 తో విధ్వంసం సృష్టించాడు. మొత్తంగా 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు. 213 స్ట్రైక్‌రేట్‌తో అందర్ని ఇంప్రెస్‌ చేశాడు. మొత్తంగా సీఎస్‌కేలో షేక్‌ రషీద్‌తో పాటు మరో యంగ్‌ టాలెంటెడ్‌ బ్యాటర్‌ ఉన్నాడనే విషయం సీఎస్‌కే ఫ్యాన్స్‌కు అర్థమైపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాహుల్‌ త్రిపాఠి, విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా వంటి అవుట్‌ డేటెడ్‌ ప్లేయర్లపై నమ్మకం పెట్టుకొని.. విఫలమైన సీఎస్‌కే.. ఇక కుర్రాళ్లను రంగంలోకి దింపింది. వీళ్ల ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే.. వీళ్లనా ఇంత కాల సీఎస్‌కే ఆడించకుండా బెంచ్‌పైన కూర్చోబెట్టింది అంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.