ఈ ఆటగాడికి అరంగేట్రం సమయంలో ఎలాంటి ఫేమ్, నేమ్ లేదు. అప్పటికే జట్టులో దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. తొలినాళ్లల్లో కూడా ఫామ్‌తో సతమతమయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్‌లకు అతడికి చోటు దక్కుతుందా అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే.. కెప్టెన్‌గా తన జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను.. 2 ప్రపంచకప్ ట్రోఫీలు అందించాడు. అంతేకాదు.. తాను సారధిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించాడు. ప్రత్యర్ధులను బెదరగొట్టాడు. ఒకానొక తరుణంలో సచిన్‌నే మించిపోయాడు. అతడెవరో కాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్.
దేశం కోసం ఆడాలన్నది, తన అరంగేట్ర మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శన కనబరచాలన్నది ప్రతీ క్రికెటర్ కల. డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత ఆస్ట్రేలియా ఆల్-టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన రికీ పాంటింగ్ కూడా ఇలాగే తన కెరీర్‌ను ప్రారంభించాలనుకున్నాడు. అయితే అతడికి వన్డే, టెస్టుల్లో చుక్కెదురు అయింది. డిసెంబర్ 19న తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న పాంటింగ్, ఫిబ్రవరి 1995లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. తాను అనుకున్న స్థాయిలో వన్డే అరంగేట్రం చేయలేకపోయాడు. కానీ అతడు టెస్టుల్లో మాత్రం మెరుపు బ్యాటింగ్‌తో అరంగేట్రం చేశాడు. డిసెంబర్ 1995లో శ్రీలంకతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన పాంటింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో పాంటింగ్‌కు నిరాశే మిగిలింది.
తన అరంగేట్రం టెస్ట్‌లో సెంచరీ చేసే అవకాశం పాంటింగ్ తృటిలో మిస్సయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 96 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. తద్వారా అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించాలనే అతడి కల చెదిరిపోయింది. ఇలా వన్డే, టెస్టు అరంగేట్రం మ్యాచ్‌ల్లో పాంటింగ్‌కు చుక్కెదురు అయింది.
అరంగేట్రం మ్యాచ్ తనకు మిగిల్చిన బాధ నుంచి ప్రత్యర్ధి జట్లకు భయాన్ని పరిచయం చేశాడు రికీ పాంటింగ్. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేశాడు. 2002-11 మధ్యకాలంలో తన సారధ్యంలో ఆస్ట్రేలియా టీంతో క్రికెట్‌ను శాసించాడు. అతడి కెప్టెన్సీలో, ఆస్ట్రేలియా 2003, 2007లో వరుసగా రెండుసార్లు ODI ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అంతేకాదు 1999లో స్టీవ్ వా కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో పాంటింగ్ సభ్యుడు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రికీ పాంటింగ్ ముందు వరుసలో ఉంటాడు.
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌కు గట్టి పోటీనిచ్చాడు రికీ పాంటింగ్. కొన్ని సందర్భాల్లో సచిన్‌ను సైతం మించిపోయాడు. 168 టెస్టుల్లో 41 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలతో 13 వేల 378 పరుగులు చేశాడు పాంటింగ్. అలాగే 375 వన్డేల్లో 30 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలతో 13 వేల 704 పరుగులు చేశాడు. అటు ఆస్ట్రేలియా తరపున 17 T20 మ్యాచ్‌లలో 2 అర్ధ సెంచరీలతో 401 పరుగులు రాబట్టాడు పాంటింగ్. సచిన్ టెండూల్కర్(100) తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు పాంటింగ్ కాగా.. ఆ రికార్డును తాజాగా విరాట్ కోహ్లీ(72) బ్రేక్ చేసిన విషయం విదితమే.