Ind vs Aus: టీమ్ ఇండియా గెలవడం పక్కా? దానికి ఇదే నిదర్శనం..

|

Nov 24, 2024 | 12:37 PM

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది.

Ind vs Aus: టీమ్ ఇండియా గెలవడం పక్కా? దానికి ఇదే నిదర్శనం..
Ind Vs Aus
Follow us on

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ తొలి మ్యాచ్ మూడో రోజుకి చేరుకుంది. మూడో రోజు ఆట ఆరంభంలోనే అద్భుత బ్యాటింగ్‌ కనబర్చిన యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీతో భారత జట్టు 304 పరుగులు పూర్తి చేసుకుంది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యంతో టీమ్ ఇండియా మొత్తం స్కోరు 350 దాటింది.

భారత జట్టు స్కోరు 350 దాటడంతో ఆస్ట్రేలియా జట్టుకు ఓటమి ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే టెస్టు క్రికెట్‌లో పటిష్టమైన జట్టు అయినప్పటికీ స్వదేశంలో భారీ మొత్తం ఛేజింగ్‌లో ఆసీస్ జట్టు ఇంకా వెనుకబడి ఉంది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం…

  • స్వదేశంలో ఆస్ట్రేలియా 15 టెస్టు మ్యాచ్‌ల్లో 300+ స్కోర్‌లను చేజ్ చేసింది.
  • అందుల్లో 3 సార్లు మాత్రమే గెలిచింది.
  • మిగిలిన 7 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయింది. అంటే ఆసీస్ తరచుగా 300+ స్కోరును ఛేజింగ్‌లో ఓటమిని చవిచూసిందని చెప్పవచ్చు
  • అయితే 300+ స్కోరు ఛేజింగ్‌లో ఆ మ్యాచ్‌ని 5 సార్లు డ్రా చేసుకుంది. అంటే ఓటమి భయంతో ఆసీస్ జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించిందనే చెప్పాలి.

ఇది చదవండి: IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలానికి వేళాయేరా..ఎలా చూడాలి? ఎవరి వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయి? పూర్తి వివరాలు ఇదిగో..

స్వదేశంలో ఆస్ట్రేలియా విజయవంతమైన ఛేజింగ్:

  • స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టు ఛేజ్ చేసిన అత్యధిక స్కోరు 404. అది కూడా 1948లోనే కావడం గమనార్హం.
  • దీని తర్వాత 1977లో పెర్త్ టెస్టులో భారత్‌పై 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 2 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
  • అలాగే 1999లో అడిలైడ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 369 పరుగుల ఛేజ్ చేసి విజయం సాధించింది. 

అంటే స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టు 350+ పరుగుల ఛేజింగ్‌కు 25 ఏళ్లు పూర్తయ్యాయి. భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌కి టీమ్ ఇండియా 400+ పరుగుల భారీ టార్గెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

భారత్ ప్లేయింగ్ 11:  జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యస్సవి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా.

ఇది కూడా చదవండి: IPL 2025 Auction: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. లిస్టులో మనోళ్లు ఎంతమందంటే?

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11:  ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.

ఇవి కూడా చదవండి: Hardik Pandya: 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్ చేస్తే.. రికార్డు స్పష్టించిన స్టార్ ఆల్‌రౌండర్..

IPL 2025 Auction: మెగా వేలం నిర్వహించే ఆక్షనీర్ మల్లికా సాగర్ గురించి తెలుసా..?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి