టీ20 ప్రపంచకప్‌కు ముందు చాలా దేశాలు టీ20 మ్యాచ్‌లు నిరంతరాయంగా ఆడుతున్నాయి. ఇక తాజాగా బుధవారం నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం అయింది. కరారా వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 145 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో రెండు టీ20 ల సిరీస్‌లో మిజయంతో మందడుగు వేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆరోన్ ఫించ్ 58 పరుగులు సాధించి, విజయంతో కీలక పాత్ర పోషించాడు. అలాగే చివర్లో మ్యాథ్యూవేడ్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కైల్ మేయర్స్ ఓ అద్భుతమైన షాట్ ఆడడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కైల్ మేయర్స్ 105 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టాడు. కామెరాన్ గ్రీన్ బంతిపై ఈ షాట్ చాలా అద్భుతంగా బాదేశాడు. దీనిని సోషల్ మీడియాలో షాట్ ఆఫ్ ది సెంచరీ అని పిలుస్తూ, ట్రెండ్ చేస్తున్నారు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో, బ్యాక్‌ఫుట్‌లో ఉన్న కైల్ మేయర్స్, కామెరాన్ గ్రీన్ వేసిన బంతిని కవర్ వైపుగా బాదేశఆడు. 143 KMPH వేగంతో వచ్చిన ఈ బాల్ ఇంత పెద్ద మైదానంలో 105 మీటర్ల దూరంలో పడింది.
WOW!
Incredible six from Mayers – over cover! #AUSvWI pic.twitter.com/xBEaPYgFzN
— cricket.com.au (@cricketcomau) October 5, 2022
కైల్ మేయర్స్ భంగిమ, అతని షాట్ ఆడే విధానం, సమయస్ఫూర్తికి అంతా ఫిదా అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ట్వీట్ చేస్తూ క్రికెట్ చరిత్రలో ఓ మంచి షాట్ అంటూ ట్వీట్ చేశాడు.
How good was that from Kyle Mayers? ?
Watch all the action from the #AUSvWI series LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) ?https://t.co/LxMMEp8Yiw
— ICC (@ICC) October 5, 2022
ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, వెస్టిండీస్ టీంను 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది. వెస్టిండీస్ తరపున కైల్ మేయర్స్ అత్యధికంగా 39 పరుగులు చేయగా, చివర్లో ఓడియన్ స్మిత్ 27 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాలో జరుగుతున్న చివరి టీ20 సిరీస్ ఇదే. ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలోనే ప్రారంభం కానుంది.
Kyle Mayers ???pic.twitter.com/E6ZyaefFcq
— Aatif Nawaz (@AatifNawaz) October 5, 2022
Ooft, what a strike this is from Kyle Mayers ?#AUSvWIpic.twitter.com/MaYDBcEy4a
— Wisden (@WisdenCricket) October 5, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..