Ashes 2021: బ్రిస్బేన్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. జానీ బెయిర్‌స్టో స్థానంలో 23 ఏళ్ల ఆటగాడికి అవకాశం

|

Dec 07, 2021 | 1:28 PM

Australia vs England: జేమ్స్ అండర్సన్ స్థానంలో క్రిస్ వోక్స్ జట్టులోకి వచ్చాడు. అండర్సన్ గాయపడ్డాడని గతంలో వార్తలు వచ్చాయి.

Ashes 2021: బ్రిస్బేన్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. జానీ బెయిర్‌స్టో స్థానంలో 23 ఏళ్ల ఆటగాడికి అవకాశం
Ashes 2021 Australia Vs England
Follow us on

Australia vs England: బ్రిస్బేన్ వేదికగా జరగనున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. డిసెంబర్ 8న ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అందులో 11 మంది ఆటగాళ్లు గబ్బా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనున్నారు. 12 మంది సభ్యులతో కూడిన ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్‌స్టోకు చోటు దక్కలేదు. ఇంగ్లీష్ టీమ్ మేనేజ్‌మెంట్ 6వ స్థానానికి అతని స్థానంలో 23 ఏళ్ల ఆలీ పోప్‌పై విశ్వాసం ఉంచింది.

12 మంది ఆటగాళ్ల పేర్లు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్ దాదాపుగా క్లియర్ అయింది. అయితే మార్క్ వుడ్ లేదా క్రిస్ వోక్స్‌కు ఫీల్డ్‌లోకి వచ్చే అవకాశం ఇస్తారా అనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జేమ్స్ అండర్సన్ స్థానంలో క్రిస్ వోక్స్ జట్టులోకి వచ్చాడు. అండర్సన్ గాయపడ్డాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అండర్సన్ ఫిట్‌గా ఉన్నాడని జోస్ బట్లర్ ధృవీకరించాడు. కాగా, పింక్ బాల్‌తో ఆడబోయే రెండవ టెస్ట్‌ మేరకు మొదటి టెస్ట్ నుంచి విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కన్నాడు.

బ్రిస్బేన్ టెస్టు కోసం 12 మంది సభ్యులతో కూడిన ఇంగ్లాండ్ జట్టు
జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, జోస్ బట్లర్ (కీపర్), హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

జట్టును చూస్తుంటే కెప్టెన్ రూట్ మినహా హమీద్, బర్న్స్, బట్లర్, ఒలీ పోప్, మలాన్ భుజాలపై బ్యాటింగ్ కమాండ్ ఉంటుందని స్పష్టమవుతోంది. అయితే బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ పాత్రలో కొనసాగనున్నాడు. ఇది కాకుండా నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒకే ఒక్క స్పిన్నర్‌తో జాక్ లీచ్ ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టబోతున్నారు.

Also Read: IND VS SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో వీరిద్దరికి నో ఛాన్స్.. తెలుగు కుర్రాడికి అవకాశం: వీవీఎస్ లక్ష్మణ్

Australia vs England Head To Head In Ashes: బూడిద కోసం పోరు.. బలంగానే ఇరుజట్లు.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?