AUS Team for WTC Final vs IND: భారత్, ఆస్ట్రేలియా జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రేపు తలపడబోతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ రేపే కావడంతో ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్‌లో పాటకమ్మిన్స్ మాట్లాడుతూ.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫైనల్ బరిలోకి దిగుతామని ప్రకటించాడు. ఇక ఈ ముగ్గురిలో తనతో పాటు, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలండ్ ఉన్నారని తెలియజేశాడు. ఈ సందర్బంగానే తుదిజట్టులో మైఖేల్ నెసర్ ఉంటాడని జరుగుతున్న ప్రచారంపై కూడా కమ్మిన్స్ ఈ విధంగా బదులిచ్చాడు. బోలండ్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉందని, భారత ఆటగాళ్లను కట్టడి చేయగల సత్తా తనలో ఉన్నందుకే అతన్ని ఎంచుకున్నట్లుగా కంగారుల సారథి చెప్పుకొచ్చాడు.
తమ ముగ్గురి ఫాస్ట్ బౌలింగ్‌తో టీమిండియాను ఇబ్బంది పెడతామని.. ఇంకా కామెరూన్ గ్రీన్ కూడా మెరుపు వేగంతో బంతులు విసరగల సత్తా కలిగిన ఆల్‌రౌండర్ అని కమ్మిన్స్ తెలిపాడు. అంతేకాక ఓవల్ స్పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. తమ తరఫున లెజెండరీ స్పిన్నర్ నాథన్ లియాన్ టీమిండియా బ్యాటర్లకు సమాధానం చెప్పగలడని, ఏది ఏమైనా విజయం తమనే వరిస్తుందని కమ్మిన్స్ ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు టీమిండిమా నుంచి పూర్తి క్లారిటీ రాలేదు. ముఖ్యంగా వికెట్ కీపర్ విషయంలో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ పోటీపడుతున్నందున.. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి పరిస్థితి కత్తిమీద సాములా మారింది. అలాగే బౌలర్ల విషయంలో కూడా ఏ మాత్రం క్లారిటీ రాలేదు. ఫైనల్ మ్యాచ్‌లో ముగ్గురు స్పీడ్‌బైలర్లతో బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నా.. వారెవరనే దానిపై నిర్ధారణకు రాలేదు.
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్
భారత జట్లు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమాన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్(వికెట్‌కీపర్), ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ,మహ్మద్ సిరాజ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..