Video: టాక్సీలో మైదానానికి క్రికెటర్లు.. కట్‌చేస్తే.. మధ్యలోనే ట్రబుల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బ్రిస్బేన్ హీట్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. "మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న విధానం ఇది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో మార్నస్ లబుషేన్ ఉత్సాహంగా టాక్సీని నెడుతూ నవ్వుతూ కనిపించారు. అభిమానులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

Video: టాక్సీలో మైదానానికి క్రికెటర్లు.. కట్‌చేస్తే.. మధ్యలోనే ట్రబుల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Bbl Video

Updated on: Jan 01, 2026 | 2:02 PM

క్రికెట్ మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో అలరించే ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు రోడ్డుపై టాక్సీని నెడుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బిగ్ బాష్ లీగ్ (BBL) మ్యాచ్ కోసం స్టేడియానికి వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న టాక్సీ మొరాయించడంతో, సమయానికి చేరుకోవడానికి క్రికెటర్లే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ అరుదైన, హాస్యస్పదమైన దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సాధారణంగా అంతర్జాతీయ క్రికెటర్లు అత్యంత ఖరీదైన కార్లలో లేదా భారీ భద్రత కలిగిన టీమ్ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు స్టార్ ఆటగాళ్లు మాత్రం తమ బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌కు సమయానికి చేరుకోవడానికి ఒక సామాన్యుడిలా రోడ్డుపై పడ్డారు.

అసలేం జరిగింది?..

బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్నస్ లబుషేన్, మాట్ రెన్ షా, మిచెల్ స్వీప్సన్ ఒక టాక్సీలో స్టేడియానికి బయలుదేరారు. అయితే, స్టేడియానికి చేరువలో ఉండగా వారు ప్రయాణిస్తున్న టాక్సీ అకస్మాత్తుగా ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాలేదు.

టాక్సీ డ్రైవర్‌కు సాయం..

మ్యాచ్ ప్రారంభం కావడానికి సమయం తక్కువగా ఉండటంతో, వేరే వాహనం కోసం వేచి చూడకుండా ఈ ముగ్గురు స్టార్ క్రికెటర్లు కారు దిగి, స్వయంగా టాక్సీని వెనుక నుంచి నెట్టడం ప్రారంభించారు. కోట్లాది రూపాయల విలువైన ఈ ఆటగాళ్లు సాధారణ వ్యక్తులలా రోడ్డుపై టాక్సీని తోయడం చూసి అటుగా వెళ్తున్న వారు షాక్‌కు గురయ్యారు.

వైరల్ వీడియో..

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బ్రిస్బేన్ హీట్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. “మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న విధానం ఇది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో మార్నస్ లబుషేన్ ఉత్సాహంగా టాక్సీని నెడుతూ నవ్వుతూ కనిపించారు. అభిమానులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. “వీరి నిరాడంబరతకు హ్యాట్సాఫ్” అని కొందరు అంటుంటే, “ఆసీస్ ప్లేయర్లు ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ను రోడ్డుపైనే మొదలుపెట్టారు” అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు.

ఏది ఏమైనా, ఎన్ని కోట్లు సంపాదించినా, సెలబ్రిటీ హోదా ఉన్నా సమయానికి స్టేడియానికి చేరుకోవాలనే వారి నిబద్ధత మరియు డ్రైవర్‌కు సాయం చేసిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..