Watch Video: వావ్.. వాట్ ఏ క్యాచ్.. ఆసీస్ ఆటగాడి ఫీల్డింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వైరలవుతోన్న వీడియో..!

|

Jan 16, 2022 | 7:39 PM

Glenn Maxwell: గ్లెన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను తన కెప్టెన్సీలో ఆదివారం జట్టును అద్భుతమైన విజయం అదించాడు.

Watch Video: వావ్.. వాట్ ఏ క్యాచ్.. ఆసీస్ ఆటగాడి ఫీల్డింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వైరలవుతోన్న వీడియో..!
Big Bash League Glenn Maxwell
Follow us on

Big Bash League 2022: గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) మైదానంలో ఉండే ఆ సందడే వేరు అంటుంటారు. కొన్నిసార్లు బ్యాట్‌తో, మరికొన్ని సార్లు బంతితో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. టీ20 క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ తుఫాను బ్యాట్స్‌మెన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం, ఈ ఆటగాడు బిగ్ బాష్ లీగ్‌(Big Bash League)లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు . ఆదివారం మెల్‌బోర్న్ స్టార్స్(Melbourne Stars) మ్యాచ్ బ్రిస్బేన్ హీట్‌తో జరగగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ తన ఫీల్డింగ్‌తో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అద్భుత క్యాచ్‌తో నెట్టింట్లో వైరల్‌గా మారాడు. మ్యాక్స్‌వెల్ క్యాచ్‌ను చూసి మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

బ్రిస్బేన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ జరుగుతోంది. నాథన్ కౌల్టర్-నైల్ బౌలింగ్ చేయగా, ఆ ఓవర్ మూడో బంతికి సామ్ హీజ్లెట్ అద్భుతమైన షాట్ ఆడాడు. మ్యాక్స్‌వెల్‌ అద్భుత క్యాచ్‌ పట్టి సామ్‌ ఇన్నింగ్స్‌ ముగించాడు. సామ్ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడాడు. అక్కడే నిలబడిన మాక్స్‌వెల్ చేతిని వెనక్కి పెట్టి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. అనంతరం ఈ క్యాచ్‌ను చూసి మ్యాక్స్‌వెల్ కూడా ఆశ్చర్యపోయాడు.

స్టార్లు విజయం సాధించారు..
ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు స్టార్ల జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ జట్లు 150 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని స్టార్స్ జట్టు కేవలం 13.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. అద్భుతమైన ఫీల్డింగ్ తర్వాత, మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌తో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్ తన ఓపెనింగ్ భాగస్వామి జో క్లార్క్‌తో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ 10 సగటుతో పరుగులు రాబట్టారు. 11వ ఓవర్ నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్ ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ 30 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. క్లార్క్ ఇన్నింగ్స్ కూడా టీం స్కోరు 110 వద్ద ముగిసింది. 36 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.

హిల్టన్ కార్ట్‌రైట్, మార్కస్ స్టోయినిస్ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. స్టోయినిస్ 10 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. హిల్టన్ ఏడు బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు.

బ్రిస్బేన్ ఇన్నింగ్స్ ఇలా..
టాస్ గెలిచిన బ్రిస్బేన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిస్ లీన్, నాథన్ మెక్‌స్వీనీ జోడీ జట్టుకు శుభారంభం అందించి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించింది. 28 పరుగుల వద్ద లీన్ ఔటయ్యాడు. మూడు పరుగులకే నాథన్ వికెట్ పడింది. అతను 20 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ తరఫున బెన్ డకెట్ అత్యధికంగా 51 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 42 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో రెండు సిక్సర్లు బాదాడు. మెల్‌బోర్న్‌ తరఫున ఆడమ్‌ జంపా రెండు వికెట్లు తీశాడు. మ్యాక్స్‌వెల్ ఇక్కడ కూడా బాగా రాణించి నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

Also Read: టీమిండియాకు బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అతడే.. నాలుగేళ్ల పాటు నెంబర్ వన్‌గా భారత్.. అద్భుత గణాంకాలు ఇవే!

Virat Kohli Resigns: ఆ సమయంలో నీ కళ్లల్లో నీళ్లు చూశాను: విరాట్ రాజీనామాపై అనుష్క ఉద్వేగం