Josh Inglis: 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో ప్రీతిజింటా ప్లేయర్ ఊచకోత.. 33 బంతుల్లోనే రిటైర్మెంట్ ప్లేయర్‌కు కన్నీళ్లు

West indies vs Australia, 2nd T20I: ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిస్ వెస్టిండీస్‌తో జరిగిన రెండవ T20 మ్యాచ్‌లో 78 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.

Josh Inglis: 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో ప్రీతిజింటా ప్లేయర్ ఊచకోత.. 33 బంతుల్లోనే రిటైర్మెంట్ ప్లేయర్‌కు కన్నీళ్లు
Josh Inglis

Updated on: Jul 23, 2025 | 2:20 PM

Josh Inglis Batting: వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్ బుధవారం, జులై 23న జమైకాలోని సబీనా పార్క్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాట్స్‌మన్ జోష్ ఇంగ్లిస్ బలమైన ఇన్నింగ్స్‌తో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. అయితే, అతను విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకలేకపోయాడు. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం జోష్ ఇంగ్లిస్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్.

జోష్ ఇంగ్లిస్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్..

ప్రీతి జింటా ఆధ్వర్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు తరపున జోష్ ఇంగ్లిస్ IPL 2025లో పాల్గొన్నాడు. ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ కూడా ఈ సీజన్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 2025 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 30.89 సగటు, 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 73 పరుగులు. వెస్టిండీస్‌తో జరిగిన T20 సిరీస్‌లో ఇంగ్లిస్ తన అదే ఫామ్‌ను కొనసాగించాడు. మొదటి T20 మ్యాచ్‌లో, అతను 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్ల సహాయంతో 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత, రెండవ మ్యాచ్‌లో, అతను 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో అజేయంగా 78 పరుగులు చేశాడు. అతను కేవలం ఫోర్లు, సిక్సర్లతో 58 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ విండీస్ జట్టు తరపున 51 పరుగులు చేయగా, రస్సెల్ 36 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా, ఆస్ట్రేలియా 16 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంది. ఇంగ్లిస్ కాకుండా, కామెరాన్ గ్రీన్ 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

సిరీస్‌లో ఆస్ట్రేలియా ముందంజ..

ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి T20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండవ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ జులై 25న జరుగుతుంది. ఈ టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ కొనసాగాలంటే, తదుపరి మ్యాచ్‌లో గెలవడం వారికి ముఖ్యం. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..