గృహ హింస కేసులో అరెస్టైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ప్రధాన మంత్రిపైనా వివాదాస్పద ట్వీట్‌తో మరిన్ని చిక్కులు

|

Oct 20, 2021 | 12:31 PM

Michael Slater: ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. ప్రధాన మంత్రిపై వివాదాస్పద ట్వీట్, బోర్డుతో గొడవలు, డ్రగ్స్‌ ఇలా ఎన్నో వివాదాలకు కేరా‌ఫ్ అడ్రస్‌గా నిలిచాడు.

గృహ హింస కేసులో అరెస్టైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ప్రధాన మంత్రిపైనా వివాదాస్పద ట్వీట్‌తో మరిన్ని చిక్కులు
Michael Slater
Follow us on

Australia Cricket Team: గృహ హింస ఆరోపణలపై ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ మైఖేల్ స్లేటర్‌ను బుధవారం అరెస్టు చేశారు. స్లేటర్ మేనేజర్, సీన్ ఆండర్సన్ ఈ ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు గత వారం స్లేటర్‌పై గృహ హింస నివేదిక దాఖలు చేశారని, మంగళవారం దర్యాప్తు ప్రారంభించి, అరెస్టు చేసి 51 ఏళ్ల స్లేటర్‌ను ఎన్‌ఎస్‌డబ్ల్యూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

స్లేటర్ ఆస్ట్రేలియా గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. అతను 8 సంవత్సరాల కెరీర్‌లో 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. అప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా కామెంటేటర్‌గా పనిచేస్తున్నాడు. స్లేటర్ ఇటీవల సెవెన్ నెట్‌వర్క్ వ్యాఖ్యాన ప్యానెల్ నుంచి తొలిగించారు. అతను చాలా కాలంగా భార్యతో విడిపోయాడు. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆరోపించింది. 2001 సంవత్సరంలో యాషెస్ సిరీస్ అతని చివరి సిరీస్‌గా మిగిలింది. జస్టిన్ లాంగర్ అతడిని జట్టు నుంచి తొలగించాడు. ఇది స్లేటర్ జస్టిన్‌కే ఏమాత్రం నచ్చలేదు

విమానం నుంచి దించేశారు..
దీనికి రెండు సంవత్సరాల ముందు, ఇద్దరు మహిళా స్నేహితులతో గొడవ కారణంగా స్లేటర్ విమానం నుంచి కిందకు దించేశారు. సిడ్నీ నుంచి క్వాంటాస్ విమానంలో వాగాకు ఇద్దరు మహిళా స్నేహితులు కలిసి ప్రయాణిస్తూ గొడవపడ్డారు. దీంతో అతన్ని విమానంలోని బాత్‌రూమ్‌లో బంధించారు. ఈ కారణంగా విమానం టేకాఫ్‌లో జాప్యం జరిగింది. ఈ కారణంగా అతడిని విమానం నుంచికిందకు దించారు.

ప్రధానమంత్రిపై ప్రకటనతో వివాదాలు..
స్లేటర్ ఈ ఏడాది మేలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ పై చేసిన ప్రకటనతో వివాదంలో చిక్కుకున్నాడు. దేశ ప్రభుత్వ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం ద్వారా ఆయన తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియన్ పౌరుల భద్రత గురించి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే, మేము దేశానికి తిరిగి రావడానికి అనుమతిస్తాం. ఇది అవమానకరం. ప్రధాని మీ చేతుల్లో మా భవిష్యత్తు ఉంది. మమ్మల్ని ఇలా ఎలా ట్రీట్ చేస్తారు? మీ క్వారంటైన్ సిస్టమ్‌కు ఏమైంది? ఐపీఎల్‌లో పనిచేయడానికి నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ, ప్రస్తుతం నేను ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది’ అని రాసుకొచ్చాడు. దీంతో స్లేటర్ మరింత చిక్కుల్లో పడ్డాడు.

Also Read: T20 World Cup 2021: ఆకట్టుకున్న ఒమన్ ఫాస్ట్ బౌలర్.. కళ్లు చెరిదే క్యాచ్‌తో బంగ్లాకు షాక్.. 11 ఏళ్ల క్రితం భారత్‌ను కూడా బోల్తాకొట్టించాడు..!

T20 World Cup 2021: తొలి మ్యాచులో మోకాలిపై కూర్చుని నిరసన.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్ల నిర్ణయం.. ఎందుకో తెలుసా?