పాక్‌పై ఘన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు పడుతోన్న దిగ్గజం

|

Jan 07, 2025 | 1:53 PM

Stuart Law: ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు ప్రస్తుతం ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. 55 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం కలిగిన ఈ ఆటగాడు.. 1300 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. కొన్ని ఆరోపణలతో తన కోచింగ్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ప్రస్తుతం లింక్‌డ్ ఇన్‌లో రెజ్యూం పోస్ట్ చేశాడు.

పాక్‌పై ఘన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు పడుతోన్న దిగ్గజం
Usa Head Coach Stuart Law
Follow us on

Stuart Law: ఆస్ట్రేలియా తరపున 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ ఆటగాడు నేడు ఉద్యోగం కోసం పోరాడుతున్నాడు. ఇంతకంటే అవమానకరం ఏముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు, ఉద్యోగం కోసం ఎందుకు తిప్పలు పడుతున్నాడో తెలుసుకుందాం. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్టువర్ట్ లా యూఎస్‌ఏ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వివక్షత ఆరోపణలతో తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. కానీ, ప్రస్తుతం అతను లింక్‌డిన్‌లో కోచ్‌గా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్‌కు యూఎస్‌ఏ కంటే ముందు శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

ఆటగాళ్లతో సఖ్యత నిల్..

వెస్టిండీస్‌తో పాటు 2024 టీ20 ప్రపంచకప్‌కు యూఎస్‌ఏ ఆతిథ్యం ఇచ్చింది. ఈ ప్రపంచకప్ సమయంలో స్టువర్ట్ లా యూఎస్‌ఏ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. అతని కోచింగ్‌లో జట్టు కూడా మంచి ప్రదర్శన చేసింది. అయితే, ఆ సమయంలో ఆటగాళ్లతో సఖ్యత లోపించింది. ఇది నెదర్లాండ్స్ పర్యటనలో మరింత పెరిగాయి.

స్టువర్ట్ లాపై వివక్షత ఆరోపణలు..

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, యూఎస్‌ఏ జట్టులోని చాలా మంది ఆటగాళ్ళు స్టువర్ట్ లాకు వ్యతిరేకంగా బోర్డుకు ఒక లేఖ రాశారు. అందులో ఆటగాళ్ల పట్ల అతని దృక్కోణం వేరేలా ఉందని, ఇది జట్టు వాతావరణానికి ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. ఆటగాళ్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు స్టువర్ట్ లా పనిచేస్తున్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో అతనిపై వేటు పడింది.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ 2024లో యూఎస్‌ఏ ప్రదర్శన..

టీ20 ప్రపంచ కప్ 2024లో స్టువర్ట్ లా కోచింగ్‌లో యూఎస్‌ఏ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడితే, యూఎస్‌ఏ సూపర్-8 వరకు ప్రయాణించింది. గ్రూప్ దశలో, ఆజట్టు తన 4 మ్యాచ్‌లలో 2 గెలిచింది. అందులో ఒక విజయం పాకిస్తాన్‌పై రావడం గమనార్హం. సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

స్టువర్ట్ లా కెరీర్..

స్టువర్ట్ లా 1994, 1999 మధ్య ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడాడు. ఈ కాలంలో, అతను 1 టెస్ట్, 54 వన్డేలు ఆడాడు. అందులో 1300 ప్లస్ పరుగులు చేయడంతో పాటు, అతను తన పేరు మీద 12 వికెట్లు తీసుకున్నాడు. స్టువర్ట్ లా వన్డే అరంగేట్రం జింబాబ్వేపై కాగా, టెస్టు అరంగేట్రం శ్రీలంకపై జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..