Brad Hogg: తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడిన టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం విధితమే. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన భారత టీ20 ప్రపంచకప్ జట్టులో అయ్యర్ పేరు లేదు. ఈ క్రమంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాడని అందరూ భావించారు. కానీ అయ్యర్ మాత్రం అలాంటి ప్రభావం పడకుండా మంచి ఆటతీరును కనబరిచాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అయ్యర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా హాగ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ క్యాపిటల్స్ విజయం తర్వాత అయ్యర్ ప్రెస్‌మీట్ చూస్తే భవిష్యత్తులో అతను టీమిండియా కెప్టెన్ అవుతాడని అనిపించింది’ అని హాగ్ చెప్పాడు. శ్రేయాస్ మానసికంగా ఎంతో పరిణతి చెందాడని పొగడ్తల వర్షం కురిపించాడు. ‘గాయం నుంచి కోలుకున్నా టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు, ఐపీఎల్ జట్టు సారధ్యం కూడా తొలగించారు.. ఇలాంటి సందర్భంలో అతనిపై చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ దీని ప్రభావం తన ఆటతీరుపై పడకుండా రీఎంట్రీ తొలి మ్యాచ్‌లో మంచి ప్రతిభను కనబరిచాడు’ అని చెప్పుకొచ్చాడు. ఇక అయ్యర్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, భవిష్యత్తులో భారత జట్టు సారధి అయ్యే అవకాశం ఉందని హాగ్ అభిప్రాయపడ్డాడు.
PM Modi: మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?
IPL 2021: నటరాజన్ స్థానంలో జమ్మూ కశ్మీర్ బౌలర్.. హైదరాబాద్ జట్టులో ఎన్ని రోజులుంటాడంటే?