ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే, టీ20 మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. అయితే ఇంతలోనే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఆస్ట్రేలియన్ మీడియా ప్రకారం, గ్లెన్ మాక్స్‌వెల్ ఒక లేట్ నైట్ పార్టీకి హాజరై పూటుగా తాగేశాడట. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతను అడిలైడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడట. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. అయితే లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న మ్యాక్స్ వెల్ ను ఎందుకు ఆస్పత్రిలో చేర్చుకున్నాడనే దానిపై అధికారిక సమాచారం బయటకు రాలేదు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం, గ్లెన్ మాక్స్‌వెల్‌ను వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ లేదా వన్డే సిరీస్ కోసం జట్టులో ఎంపిక చేయలేదు. కాబట్టి మాక్స్‌వెల్ BBLలో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ ఆ జట్టు టోర్నీలో పేలవ ప్రదర్శన చేసి లీగ్ దశలోనే నిష్క్రమించింది. తద్వారా జట్టు పేలవ ప్రదర్శనతో విసిగి వేసారిన మ్యాక్స్ వెల్.. జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు జట్టు ఆటగాళ్లకు తెలిపాడు.
బీబీఎల్‌లో తన జట్టు పోరాటం ముగిసినందున, ఆ జట్టు ఆటగాళ్లు అర్ధరాత్రి పార్టీలో పాల్గొంది. గ్లెన్ మాక్స్‌వెల్ కూడా పార్టీలో చేరాడు. అయితే పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడంతో మాక్స్‌వెల్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. టెస్టులు, వన్డేల నుంచి విశ్రాంతి తీసుకున్న మ్యాక్స్ వెల్ ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ తో ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పాట్ కమిన్స్, మిచ్ మార్ష్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లకు కూడా వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి లభించింది. అంతకుముందు, మాక్స్‌వెల్ తన స్నేహితుడి బర్త్ డే పార్టీలో ప్రమాదవశాత్తూ కాలుజారి కింద పడ్డాడు. దీంతో అతని కాలు విరిగింది. ఈ కారణంగా కొన్ని నెలల పాటు జాతీయ జట్టుకు దూరమయ్యాడు మ్యాక్సీ.
🚨BREAKING🚨:
Australia batter Glenn Maxwell under investigation by Cricket Australia after being hospitalised following drunken night in Adelaide 👀
{Australian Media] #BBL13 #AUSvsWI pic.twitter.com/VB6qPz2FN3
— Fourth Umpire (@UmpireFourth) January 22, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి