
ICC World Cup 2023: అక్టోబర్ 8న ప్రపంచ కప్ 2023లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కంగారూ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ భారీ రియాక్షన్ ఇచ్చారు. పాట్ కమిన్స్ భారత బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. భారత బౌలర్లకు వ్యతిరేకంగా అతను అద్భుతమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు ప్రకటించాడు. ప్రపంచకప్‌నకు ముందు ఆసియాకప్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ భారత జట్టు బౌలర్ల ఆటతీరు బాగానే ఉంది. జట్టులో చాలా మంది అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అందుకే భారత బౌలింగ్ గురించి ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుతున్నారు.
అయితే, భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు పూర్తిగా సిద్ధమైందని పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ది వీక్ ప్రకారం’ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు శిక్షణ ప్రారంభించాం. మా ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఆడారు. మా బ్యాటింగ్ ఆర్డర్ భారత్‌లో చాలా మ్యాచ్‌లు ఆడింది. వారు చాలా బాగా ఆకట్టుకున్నారు. అందుకే మాకు భారత బౌలర్ల గురించి బాగా తెలుసు. పక్కాగా ప్లాన్ చేసుకున్నాం. మేం చాలా నమ్మకంగా ఉన్నాం. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత విజయం సాధించాం. వన్డేల్లో భారత్‌లో మా రికార్డు చాలా బాగుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈసారి భారత జట్టు బౌలింగ్ తమ బలమైన పక్షమంటూ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. గంభీర్ ప్రకారం, ఏ ప్రపంచకప్‌లోనైనా బౌలింగ్ భారతదేశానికి బలమైన పాయింట్ అని ఇది వరకు చెప్పలేదు. జీ న్యూస్‌లో జరిగిన సంభాషణలో గంభీర్ మాట్లాడుతూ.. భారత్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందింది. అయితే, ఈసారి మనకు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్లు ఉన్నారు. కాబట్టి, వీళ్లు 30 ఓవర్లు చక్కగా బౌలింగ్ చేస్తే.. మంచి స్థితిలో ఉంటాం. బౌలర్లు ఈ టోర్నమెంట్‌ను గెలుస్తారు. బ్యాట్స్‌మెన్ పరుగులు వారికి తగిన సహాయం చేస్తే చాలంటూ’ ప్రకటించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..