వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తరువాత, పాకిస్తాన్ టీ20 సిరీస్ చాలా ఘోరంగా విఫలమైంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏకపక్షంగా పాకిస్థాన్‌ను ఓడించింది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో కేవలం 7 ఓవర్లు మాత్రమే ఆడి పాక్ బౌలర్లను ఆస్ట్రేలియా పూర్తిగా ధ్వంసం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 93 పరుగులు చేసి, జవాబుగా పాకిస్థాన్ జట్టు లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచింది. పాక్ జట్టు 7 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. 9 వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి టీ20లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
94 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన పాక్ జట్టు ఆది నుంచి ఇబ్బందులు పడుతూనే ఉంది. పాక్ బ్యాట్స్‌మెన్స్ అర్థం పర్థం లేని షాట్లు ఆడుతూ కనిపించారు. సాహిబ్జాదా ఫర్హాన్ 8 పరుగులు, కెప్టెన్ రిజ్వాన్ ఖాతా కూడా తెరవలేదు. బాబర్ ఆజం 3 పరుగులు చేశాడు. 4 పరుగుల వద్ద ఉస్మాన్ ఖాన్ ఔటయ్యాడు. అఘా సల్మాన్ కూడా 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇర్ఫాన్ ఖాన్ ఖాతా తెరవలేదు. దీంతో పాకిస్థాన్ 15 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా తొలి టీ20లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
పాకిస్థాన్ జట్టును నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్ చిత్తు చేశారు. నాథన్ ఎల్లిస్ గురించి మాట్లాడితే, ఈ ఆటగాడు 2 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బాబర్ ఆజం వికెట్ కూడా తీశాడు. అతడితో పాటు జేవియర్ బార్ట్‌లెట్ కూడా 2 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపాకు 2 వికెట్లు, స్పెన్స్ జాన్సన్‌కు ఒక వికెట్ లభించింది.
కేవలం 7 ఓవర్ల మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌ను మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపారు. ఆస్ట్రేలియా ఆరంభంలోనే మగార్క్, షార్ట్ వికెట్లను కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 19 బంతుల్లో 43 పరుగులు చేసి పాక్ బౌలింగ్‌ను చిత్తుగా ఓడించాడు. ఈ ఆటగాడు తన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు. హరీస్ రవూఫ్ వేసిన ఒక ఓవర్లో మ్యాక్స్‌వెల్ 19 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..