
South Africa vs Australia WTC 2025 Final: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా తమ తుది ప్లేయింగ్ XIని ప్రకటించింది. జూన్ 11న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో ఈ కీలక పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా తమ WTC టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తుంటే, దక్షిణాఫ్రికా తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మంగళవారం లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ, తుది జట్టు ప్రకటించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ గత నెలలో ICC రివ్యూలో అంచనా వేసినట్లే జట్టు ఉండటం విశేషం.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: వ్యూహాత్మక మార్పులు, కీలక ఆటగాళ్ల పునరాగమనం..
ఆస్ట్రేలియా జట్టులో కొన్ని కీలక మార్పులు, స్టార్ ఆటగాళ్ల పునరాగమనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
ఆస్ట్రేలియా తుది జట్టు (Playing XI):
ఈ జట్టు కూర్పుతో ఆస్ట్రేలియా బలమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు సమర్థవంతమైన పేస్ దాడిని కలిగి ఉంది. లార్డ్స్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గత WTC ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా, ఈసారి కూడా టైటిల్‌ను గెలిచి టెస్ట్ క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..