Video: టీ20 వరల్డ్ కప్ 2026లోనే ది బెస్ట్ భయ్యో.. మ్యాక్సీకే మెంటలెక్కించిన నిస్సంక ఫ్లయింగ్ క్యాచ్ చూశారా..!

Catch of the T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో అన్ని జట్లు తదుపరి దశకు చేరుకునేందుకు కష్టపడుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు తెగ కష్టాలు పడుతోంది. తాజాగా శ్రీలంక మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

Video: టీ20 వరల్డ్ కప్ 2026లోనే ది బెస్ట్ భయ్యో.. మ్యాక్సీకే మెంటలెక్కించిన నిస్సంక ఫ్లయింగ్ క్యాచ్ చూశారా..!
Pathum Nissanka Catch

Updated on: Feb 17, 2026 | 8:34 AM

Pathum Nissanka Catch of the Tournament: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ జోరుగా సాగుతోంది. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్ లను ప్రేక్షకులు ఆస్వాదించారు. వీటితోపాటు కళ్లు చెదిరే క్యాచ్ లు, క్లాసికల్ ఇన్నింగ్స్, అద్భుతమైన ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఫ్యాన్స్ కు ఫుల్ పైసా వసూల్ అయ్యాయి. ఇలాంటి కోవకే శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ లోనూ చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్సంక పట్టిన ఓ క్యాచ్ కూడా ఆకట్టుకుంది. ఈ క్యాచ్ కూడా ‘టోర్నమెంట్ బెస్ట్ క్యాచ్’గా నిలిచేలా ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఒక ఈజీ క్యాచ్‌ను వదిలేసిన నిస్సంక, అదే మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని ఆస్ట్రేలియా ఆటగాళ్లను షాక్‌ ఇచ్చాడు.

టీ20 వరల్డ్ కప్ 2026లో ‘క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్’..?

ఈ అద్భుత సంఘటన 17వ ఓవర్లో చోటు చేసుకుంది. శ్రీలంక బౌలర్ హేమంత్ ఆఫ్ స్టంప్ బయట ఫుల్ లెంగ్త్ బంతి వేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ ప్రయత్నం చేశాడు. బ్యాట్ స్వీట్ స్పాట్‌కు బంతి తగిలింది. అక్కడే బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నిస్సంక ఎడమ వైపు గాల్లోకి పక్షిలా ఎగిరి, ఒంటి చేతితో కళ్లు చెదిరే క్యాచ్ తీసుకున్నాడు. ఒక్క క్షణం స్టేడియం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇది టీ20 వరల్డ్ కప్ 2026లో బెస్ట్ క్యాచ్‌గా మారే ఛాన్స్ ఉంది.

నిస్సంక సహజంగా కుడిచేతి ఫీల్డర్. కానీ, ఈ క్యాచ్ ని ఎడమ చేతితో పట్టుకోవడంతో మరింత ప్రత్యేకంగా నిలిచింది. పైగా బంతి వేగంగా రావడం, క్షణాల్లో నిర్ణయం తీసుకుని గాల్లోకి దూకడం.. దీంతో ‘గ్రావిటీని సవాల్ చేసిన క్యాచ్’గా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వరల్డ్ కప్ బెస్ట్ క్యాచ్ ఇదేనా..?

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షిమ్రోన్ హెట్‌మేయర్, బ్రియాన్ బెన్నెట్ లాంటి ఆటగాళ్లు అద్భుత క్యాచ్‌లు పట్టుకున్నారు. కానీ, నిస్సంక క్యాచ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ప్రతిస్పందించడానికి అతనికి చాలా తక్కువ సమయం మాత్రమే లభించింది. అలాగే, తన బలహీనమైన చేతితో క్యాచ్ పట్టుకోవడం ఈ ప్రయత్నాన్ని మరింత గొప్పగా నిలిచేలా చేసింది. మ్యాక్స్‌వెల్ కొట్టిన బంతి వేగం, నిస్సంక గాల్లోకి ఎగిరిన తీరు.. ఇవన్నీ కలిపి దీన్ని టీ20 వరల్డ్ కప్ 2026లో బెస్ట్ క్యాచ్‌గా నిలిపాయి.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన నిస్సంక క్యాచ్..

ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్‌ల ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ మొదటి నుంచే శ్రీలంక బౌలింగ్‌పై దూకుడుగా ప్రతాపం చూపించింది. తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించింది. మధ్యలో రెండు వికెట్లు పడినా, మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా 200కి పైగా స్కోరు చేసే స్థితిలో కనిపించింది.

ఆసీస్ స్కోరు 160/4గా ఉన్న సమయంలో నిస్సంక పట్టుకున్న క్యాచ్ మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేసింది. మ్యాక్స్‌వెల్ ఔట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా చివరి ఐదు వికెట్లు కేవలం 21 పరుగులకే కోల్పోయి 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ అద్భుత క్యాచ్ శ్రీలంకను మ్యాచ్‌కి తీసుకొచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us