AUS vs IND: సెంచరీతో చెలరేగిన ముంబైవాలా.. ఆసీస్‌ గడ్డపై తొలి మ్యాచ్‌లోనే స్పెషల్ రికార్డ్..

|

Nov 24, 2024 | 8:51 AM

ఆదివారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్‌లో మూడో రోజు సందర్భంగా యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. జోష్ హేజిల్‌వుడ్‌ను సిక్సర్ కొట్టి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

AUS vs IND: సెంచరీతో చెలరేగిన ముంబైవాలా.. ఆసీస్‌ గడ్డపై తొలి మ్యాచ్‌లోనే స్పెషల్ రికార్డ్..
Yashasvi Jaiswal
Follow us on

ఆదివారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్‌లో మూడో రోజు సందర్భంగా యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. జోష్ హేజిల్‌వుడ్‌ను సిక్సర్ కొట్టి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్ 1977లో, ఎస్ జైసింహ 1968లో ఈ ఘనత సాధించారు.

కేఎల్ రాహుల్ 176 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చిక్కాడు. 172 పరుగుల స్కోరుతో టీమ్ ఇండియా ఉదయం ఆట ప్రారంభించింది. జైస్వాల్ 90 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 62 పరుగులతో తమ ఇన్నింగ్స్‌ను రెండో రోజు ముగించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

205 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ..

తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగిన ఈ 22 ఏళ్ల ముంబై పానీపూరీ వాలా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. రెండో రోజు మెరుగైన ఫామ్‌ను కనుగొని అర్ధ సెంచరీని అందుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అతను కేఎల్ రాహుల్‌తో జత కట్టి భారత్ ఆధిక్యాన్ని 218 పరుగులకు పెంచాడు.

ఈ జోడీ మొదటి వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించి, డౌన్‌అండర్‌లో మొదటి వికెట్‌కు ఈ ఘనత సాధించిన ఆరో భారత జోడీగా నిలిచింది.

ఓవరాల్‌గా టెస్టుల్లో జైస్వాల్‌కు నాలుగో సెంచరీ. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్‌పై రాజ్‌కోట్‌లో అజేయంగా 214 పరుగులు చేశాడు. ఇది ఇప్పటి వరకు ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరుగా నిలిచింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్.