
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెమీఫైనల్‌లో జరిగే అవకాశం ఉండడంతో ఈసారి క్రికెట్ పోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి.
పురుషుల విభాగంలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ఎ: ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్.
గ్రూప్ బి: హాంకాంగ్, చైనా, మలేషియా, ఓమన్.
భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి ప్రముఖ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. దీనివల్ల వారికి క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడే శ్రమ తగ్గుతుంది.
సెప్టెంబర్ 24: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ జపాన్, హాంకాంగ్ చైనా వర్సెస్ మలేషియా.
సెప్టెంబర్ 25: హాంకాంగ్ చైనా వర్సెస్ ఓమన్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నేపాల్.
సెప్టెంబర్ 26: జపాన్ వర్సెస్ నేపాల్, మలేషియా వర్సెస్ ఓమన్.
సెప్టెంబర్ 28: పాకిస్తాన్ వర్సెస్ గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు (తొలి క్వార్టర్ ఫైనల్).
సెప్టెంబర్ 28: భారత్ వర్సెస్ గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు (రెండో క్వార్టర్ ఫైనల్).
సెప్టెంబర్ 29: శ్రీలంక వర్సెస్ గ్రూప్ ఏ విజేత (మూడో క్వార్టర్ ఫైనల్).
సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ వర్సెస్ గ్రూప్ బి విజేత (నాల్గో క్వార్టర్ ఫైనల్).
అక్టోబర్ 1: సెమీఫైనల్స్ (భారత్, పాకిస్తాన్ గెలిస్తే ఈ దశలో తలపడే అవకాశం ఉంది).
అక్టోబర్ 3: కాంస్య పతక మ్యాచ్, ఫైనల్ మ్యాచ్.
మహిళల విభాగం – గ్రూపులు, షెడ్యూల్:
మహిళల విభాగంలో కూడా జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ 1: భారత్, జపాన్, బంగ్లాదేశ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.
గ్రూప్ 2: పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్.
మహిళల విభాగంలో పోటీలు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌తో ప్రారంభమవుతాయి.
సెప్టెంబర్ 17: బంగ్లాదేశ్ వర్సెస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (క్వార్టర్ ఫైనల్ 1), పాకిస్తాన్ వర్సెస్ థాయిలాండ్ (క్వార్టర్ ఫైనల్ 2).
సెప్టెంబర్ 18: శ్రీలంక వర్సెస్ మలేషియా (క్వార్టర్ ఫైనల్ 3), భారత్ వర్సెస్ జపాన్ (క్వార్టర్ ఫైనల్ 4).
సెమీఫైనల్, ఫైనల్స్:
సెప్టెంబర్ 20: సెమీఫైనల్స్ 1, 2.
సెప్టెంబర్ 22: కాంస్య పతక మ్యాచ్, ఫైనల్స్.
ఈ షెడ్యూల్ ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ అభిమానులకు ఒక గొప్ప విందును అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠను నింపుతుందని, ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ దాయాది పోరుకు అవకాశం ఉండడం టోర్నమెంట్‌కు మరింత గ్లామర్‌ను తెస్తుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..