
India vs Nepal, Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. ఆసియన్ గేమ్స్‌లో భాగంగా భారత్, నేపాల్ మధ్య క్రికెట్ క్వార్టర్ ఫైనల్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ యశస్వీ సెంచరీ, రింకూ సింగ్ సిక్సర్ల సహాయంతో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అంతకముందు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లుగా వచ్చిన యశస్వీ, రుతురాజ్ జట్టుకు శుభారంభాన్ని అందించగలిగారు. అయితే 103 పరుగుల టీమ్ స్కోర్ వద్ద రుతురాజ్(25) వెనుదిరగ్గా.. తర్వాత వచ్చిన తిలక్ వర్మ(2), జితేష్ వర్మ(5) కూడా వెంటనే పెవిలియన్ చేరారు.
Yashasvi Jaiswal with the big score and Rinku Singh with the big finish as India pile up 202 against Nepalhttps://t.co/T0PzVngLZv #INDvNEP #AsianGames pic.twitter.com/IqmZ9En2WT
— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2023
ఇలా క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్లే వెళ్లినా.. ఓపెనర్ యశస్వీ 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకుని ఔట్ అయ్యాడు. ఇలా జితేశ్, యశస్వీ వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దుబే(19 బంతుల్లో 25), రింకూ సింగ్(37) అజేయంగా నిలిచారు. ముఖ్యంగా రింకూ సింగ్ 15 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో మరో సారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 2 వికెట్లు తీసుకోగా.. సందీప్ లమిచనే, సోంపాల్ కమి చెరో వికెట్ తీసుకున్నారు.
THE HISTORICAL MOMENT:
Yashasvi Jaiswal the youngest T20i centurion for India and the first Indian to score a hundred in a multi-sports event. pic.twitter.com/PzFVxjxrCW
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2023
కాగా, ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాపై 314, మాల్దీవ్స్‌పై 212 పరుగులు చేసి విజయం సాధించిన నేపాల్‌కి నేటి మ్యాచ్ కీలకం. ఇక నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్ 6న జరిగే సెమీ ఫైనల్స్ ఆడుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..