
Reserve Day Rules, Asia Cup 2023: ఆసియా కప్ (Asia Cup 2023) సూపర్-4 రౌండ్‌లో భారత్ వర్సెస్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే, 24.1 ఓవర్లు పూర్తయ్యే సరికి వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను ఆపేశారు. మ్యాచ్ ఆగిపోయే వరకు టీమిండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల చేసింది. విరాట్ కోహ్లీ 8, కేఎల్ రాహుల్ 17 పరుగులతో క్రీజులో నిలిచారు. రోహిత్ శర్మ 56, శుభ్మన్ గిల్ 58 పరుగులు చేసి పెవిలియన్ చేశారు. ఇద్దరి మధ్య 121 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇదిలా ఉంటే వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా అభిమానులు కూడా తీవ్ర గందరగోళంలో పడ్డారు. అయితే, కొంతమంది రిజర్వ్ డే గురించి కూడా సంతోషంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. ఈ రోజు పూర్తి కాకపోతే, రేపు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, రేపు కూడా మ్యాచ్ పూర్తి కాకపోతే, ఏ జట్టు ముందుకెళ్తుందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
భారత్, పాకిస్థాన్‌లు పొరుగు దేశాలే అయినా ఈ రెండు జట్లు క్రికెట్ మైదానంలో తలపడినప్పుడల్లా అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు క్రికెట్ ప్రేమికులు సెప్టెంబర్ 10 ఆదివారం, ఆసియా కప్ (2023) సూపర్-4 రౌండ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు ఒకదానితో పోటీపడడంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ అసంపూర్తిగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.
గ్రూప్ దశలో భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా అసంపూర్తిగా మారింది. ఆ తర్వాత టీమ్ ఇండియాకు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ఈ సూపర్-4 రౌండ్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేని కేటాయించింది. ఒకవేళ వర్షం మ్యాచ్‌కి అంతరాయం కలిగితే ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరగనుంది. ACC మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరి గ్రూప్ మ్యాచ్ పల్లెకళ్లలో జరిగినా ఇప్పుడు ఫైనల్ సహా అన్ని మ్యాచ్ లు కొలంబోలోనే జరగనున్నాయి.
5.30pm – rain stopped.
5.57pm – covers off.
6.02pm – rain comes back…!! pic.twitter.com/f1B6uqk1BM
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2023
సెప్టెంబరు 11న అంటే రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్‌ని పూర్తి చేయలేకపోతే, తర్వాత ఏమి జరుగుతుందనే ప్రశ్న కొంతమంది క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతోంది. ఏ జట్టుకు ముందుకు వెళ్లే అవకాశం లభిస్తుంది? మ్యాచ్ పూర్తి కాకపోతే ఇరు జట్లూ పాయింట్లు పంచుకోవాల్సి వస్తుందన్న సమాధానం వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఒక్కో విజయంతో 2 పాయింట్లతో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ పాయింట్లు పంపిణీ చేయాల్సి వస్తే పాకిస్థాన్‌కు 3 పాయింట్లు ఉంటాయి. భారత్‌కు ఒకటి, శ్రీలంకకు 2 పాయింట్లు ఉంటాయి. తర్వాతి మ్యాచ్‌ల ఫలితాలపై అంతా ఆధారపడి ఉంటుంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లను సెప్టెంబర్ 12న శ్రీలంకతో, సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీం ఇండియా ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..