BAN vs AFG: 6 సిక్సర్లు..17 బంతుల్లో 43 రన్స్‌.. 252 స్ట్రైక్‌ రేట్‌తో 25 నిమిషాల్లోనే మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడుగా

Asia Cup 2022: ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నజీబుల్లా జద్రాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సుడిగాలిలా చెలరేగి బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతను 17 బంతుల్లోనే 43 రన్స్‌ చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.

BAN vs AFG: 6 సిక్సర్లు..17 బంతుల్లో 43 రన్స్‌.. 252 స్ట్రైక్‌ రేట్‌తో 25 నిమిషాల్లోనే మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడుగా
Najibullah Zadran

Edited By:

Updated on: Aug 31, 2022 | 6:04 PM

Asia Cup 2022: ఆసియా కప్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. టీ20 ఫార్మాట్‌లో టోర్నీ జరుగుతుండడంతో బ్యాటర్లదే హవా సాగుతోంది. స్వల్ప స్కోర్లు నమోదైనా కొందరు ఆటగాళ్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నజీబుల్లా జద్రాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సుడిగాలిలా చెలరేగి బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతను 17 బంతుల్లోనే 43 రన్స్‌ చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఇందులో 6 సిక్సర్లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులు చేసింది. తక్కువ స్కోరైనా బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో పసికూన మొదటి 10 ఓవర్లలో 50 పరుగులు కూడా చేయలేకపోయింది. అంటే రన్‌రేట్ 6 కంటే తక్కువ.

అయితే ఆ తర్వాతి 25 నిమిషాల్లోనే మ్యాచ్‌ మారిపోయింది. క్రీజులోకి వచ్చిన నజీబుల్లా జద్రాన్ కేవలం 17 బంతులు ఆడాడు. 252.94 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 43 పరుగులు చేశాడు. ఇందులో 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ విధ్వంసకర ఇన్నింగ్సే బంగ్లాను విజయానికి దూరం చేసింది.అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎందుకంటే ముజీబ్-ఉర్-రహ్మాన్, రషీద్ ఖాన్ తన స్పిన్‌ మాయజాలంతో బంగ్లాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ముజీబ్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..