IND vs PAK: పాకిస్థాన్‌ జట్టుకు మరో ఎదురు దెబ్బ.. ఇండియాతో జరిగే మ్యాచ్‌కు ఆ స్టార్‌ ప్లేయర్‌ దూరం..

|

Aug 26, 2022 | 4:38 PM

IND vs PAK Asia Cup 2022: ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులందరి దృష్టి ఆసియా కప్‌పై ఉంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఆగస్టు 28న జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది...

IND vs PAK: పాకిస్థాన్‌ జట్టుకు మరో ఎదురు దెబ్బ.. ఇండియాతో జరిగే మ్యాచ్‌కు ఆ స్టార్‌ ప్లేయర్‌ దూరం..
Ind Vs Pak, Icc T20 Wc 2022
Follow us on

IND vs PAK Asia Cup 2022: ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులందరి దృష్టి ఆసియా కప్‌పై ఉంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఆగస్టు 28న జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. చాలా ఏళ్ల తర్వాత దాయాది జట్టుల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ కావడంతో క్రికెట్‌ ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది. దీంతో ఇరు జట్ల ప్లేయర్‌ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ విజయం కోసం ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే మ్యాచ్‌ సమీపిస్తున్న తరుణంలో పాకిస్థాన్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌ కీలక ప్లేయర్‌ పేసర్‌ మహ్మద్‌ వాసీమ్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను తుది జట్టుకు ఎంపిక కష్టమనే వాదన వినిపిస్తోంది.

అంతేకాకుండా ఇప్పటికే షహీన్‌ షా ఆఫ్రిది మోకాలి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన విషం తెలిసిందే. దీంతో పాక్‌కు దెబ్బ మీద దెబ్బ పడినట్లైంది. గురువారం నెట్‌ సెషన్‌లో వాసీమ్‌ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. నడుము నొప్పి వేదిస్తోందని వాసీమ్‌ చెప్పగానే అతనికి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేయించారు. రిపోర్ట్‌లో తేలిన అంశాల ఆధారంగా వాసీమ్‌ మ్యాచ్‌లో ఉంటాడా లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతేడాది జులైలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 21 ఏళ్ల వాసీమ్‌ ఇప్పటి వరకు 8 వన్డేలు, 11 టీ20ల్లో ఆడాడు. మరి మ్యాచ్‌ సమయానికి వాసీమ్‌ కోలుకుంటాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..