India vs England: కౌంటీ బరిలో యాష్… ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌పై కన్నేసిన స్టార్ స్పిన్నర్!

|

Jul 08, 2021 | 12:36 AM

ఇంగ్లండ్‌తో ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. ప్రస్తుతం విరామంలో ఉన్నారు.

India vs England: కౌంటీ బరిలో యాష్... ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌పై కన్నేసిన స్టార్ స్పిన్నర్!
ashwin
Follow us on

India vs England: ఇంగ్లండ్‌తో ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. ప్రస్తుతం విరామంలో ఉన్నారు. అయితే, జులై 12 వరకు భారత ఆటగాళ్లకు సెలవులు ప్రకటించిన బీసీసీఐ.. ఆ తరువాత ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే, తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ అవకాశం లభించింది. జులై 11న సర్రే టీం తరఫున అశ్విన్ కౌంటీ మ్యాచ్‌ ఆడనున్నాడు. దాంతో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీసుకు ముందు ఈ స్పిన్నర్‌కు మంచి ప్రాక్టీస్‌ దొరకనుంది. ప్రస్తుతం అశ్విన్‌ సైతం ఫ్యామిలీతో కలిసి లండన్‌లోని పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. గతంలో కౌంటీ క్రికెట్ తరపున నాటింగ్‌హామ్‌ షైర్‌, వొర్సెస్టర్‌షైర్‌కు అశ్విన్ ఆడాడు. యాష్ సర్రే తరఫున సోమర్‌సెట్‌పై ఓవల్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించి, ఇంగ్లండ్ సిరీస్‌లో చెలరేగేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా నాలుగవ టెస్టులో తలపడనుంది. జులై 11న ఈ కౌంటీ మ్యాచ్ ఆరంభం కానుంది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌లో ఓడిపోయాక, విరాట్‌ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచులను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈసీబీ.. బీసీసీఐ విన్నపాన్ని ఓకే చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌కి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి నాటింగ్‌హామ్ లో తొలి టెస్టు మొదలుకానుంది. ఇక రెండవ టెస్టు ఆగస్టు 12 నుంచి లండన్‌లోని లార్డ్స్ మైదానంలో, మూడవ టెస్టు ఆగస్టు 25 నుంచి లీడ్స్‌లో, నాలుగవ టెస్టు సెప్టెంబర్ 2 నుంచి లండన్‌లో, ఐదవ టెస్టు సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి.

మరోవైపు, ఇంగ్లండ్ టీం పాకిస్తాన్ తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జులై 8 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్.. జులై 13తో ముగుస్తుంది. అలాగే జులై 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, జులై 20తో టీ20 సిరీస్ ముగుస్తుంది.

Also Read:

Lionel Messi: ఒక్క గోల్ తో రికార్డు బ్రేక్ చేసిన లియోనల్‌ మెస్సీ… ( వీడియో )

India vs Srilanka: శిఖర్ టీం ద్వితీయశ్రేణిది కాదు.. శ్రీలంకకు పంపినందుకు సంతోషించాలి: పాక్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా