2 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. నెహ్రా దెబ్బకు లైఫ్ టర్న్! కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే బెస్ట్ బౌలర్‌గా..

ఐపీఎల్ 2025లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్ టైటాన్స్‌కు కీలక పాత్ర పోషిస్తున్నాడు. 14 వికెట్లతో పర్పుల్ క్యాప్ దిశగా దూసుకుపోతున్నాడు. 9.5 కోట్ల రూపాయలకు గుజరాత్ అతన్ని కొనుగోలు చేసింది. ఆశిష్ నెహ్రా కోచింగ్‌లో అతని బౌలింగ్‌ మెరుగైంది.

2 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. నెహ్రా దెబ్బకు లైఫ్ టర్న్! కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే బెస్ట్ బౌలర్‌గా..
Ashish Nehra, Prasidh Krish

Updated on: Apr 20, 2025 | 1:09 PM

IPL 2025లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో ఐదవ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం తర్వాత శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌ ప్లేస్‌కు చేరుకుంది. గుజరాత్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీపై 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌ తర్వాత ఈ సీజన్‌లో 14 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణను ఈ స్థాయికి తీసుకెళ్లడంలో జీటీ హెడ్‌ కోచ్‌ ఆశిష్ నెహ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో 11.5 స్ట్రైక్ రేట్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. అంటే ప్రతి 12వ బంతికి వికెట్‌ తీసుకుంటున్నాడు.

గతంలో ప్రసిద్ధ్‌ కృష్ణ ఇంత ఎఫెక్టీవ్‌గా కనిపించలేదు. ఈ సంవత్సరం గుజరాత్ టైటాన్స్‌లో చేరిన తర్వాత అతని బౌలింగ్‌ పూర్తిగా మారిపోయింది. ఆశిష్ నెహ్రా పర్యవేక్షణలో అతను డేంజరస్‌ బౌలర్‌గా మారాడు. 2018లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ నాలుగు సీజన్లలో 9 కంటే ఎక్కువ, ఒక సీజన్‌లో 8 కంటే ఎక్కువ ఎకానమీని కలిగి ఉన్నాడు. కానీ, ఈ సీజన్‌లో అతని ఎకానమీ 7.44 మాత్రమే. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ప్రసిద్ధ్ కృష్ణకు గుజరాత్ టైటాన్స్ రూ.9.50 కోట్ల భారీ ధర చెల్లించి తీసుకుంది. అందుకు తగ్గట్లే ప్రసిద్ధ్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో సరిగ్గా బౌలింగ్‌ చేయలేదు. పంజాబ్ కింగ్స్‌పై ఒక్క వికెట్ కూడా తీయకుండా 41 పరుగులు ఇచ్చాడు.

కానీ తరువాతి మ్యాచ్‌లో రిథమ్‌ అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రసిద్ధ్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇది అతని 7 సంవత్సరాల ఐపీఎల్‌ కెరీర్‌లో మొదటి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు. ఆ తర్వాత ఆర్సీబీపై 26 పరుగులిచ్చి ఒక వికెట్, ఎస్‌ఆర్‌హెచ్‌పై 25 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఎల్‌ఎస్‌జిపై 26 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. ఇలా సూపర్‌ బౌలింగ్‌తో చెలరేగిపోతున్న ప్రసిద్ధ్‌ కృష్ణ ఇప్పుడు జీటీకి ప్రధాన బౌలర్‌గా మారాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..