Ashes Series 2021-22: 185 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్.. రాణించిన లియాన్, స్టార్క్..

|

Dec 26, 2021 | 12:56 PM

యాషెస్ సిరీస్‎లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్‎లో జరుగుతున్న 3వ టెస్ట్‌లో ఇంగ్లీష్ బ్యాటర్లు తడపడ్డారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటయింది.

Ashes Series 2021-22: 185 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్.. రాణించిన లియాన్, స్టార్క్..
Australia
Follow us on

యాషెస్ సిరీస్‎లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్‎లో జరుగుతున్న 3వ టెస్ట్‌లో ఇంగ్లీష్ బ్యాటర్లు తడపడ్డారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, నాథన్ లియాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్ రెండు, కెమెరూన్ గ్రీన్ తలో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ జో రూట్ 50 పరుగులు, బెయిర్‎స్టో 35 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‎లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ తరఫున విక్టోరియా పేసర్ స్కాట్ బోలాండ్‌ అరంగేట్రం చేశాడు. అతను ఒక్క వికెట్ తీశాడు. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‎లో నాలుగు మార్పులు చేసింది. ఐదు మ్యాచ్‎ల సిరీస్‎లో ఆస్ట్రేలియా 2-0 అధిక్యంలో ఉంది.

ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లాండ్ జట్టు 200 పరుగులు కూడా చేయలేకపోవడం ఇది మూడోసారి. బ్రిస్బేన్ తొలి ఇన్నింగ్స్, అడిలైడ్ రెండో ఇన్నింగ్స్ తర్వాత, ఇప్పుడు మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా జట్టు 200 పరుగులకే పరిమితమైంది. యాషెష్ సిరీస్‎లో ఆస్ట్రేలియా బౌలర్లు నాథన్ లియాన్ 12 వికెట్లు, మిచెల్ స్టార్క్ 11 వికెట్లు, కెప్టెన్ పాట్ కమిన్స్ 10 వికెట్లు తీశారు.

మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 57 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు.

Read Also.. IND vs SA: భారత్ పేస్ దళం బలంగా ఉంది.. టెస్ట్ సిరీస్‎లో వారిదే పై చేయి..