IPL Auction 2021: ఐపీఎల్ వేలంలో తొలిసారిగా పాల్గొన్న సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌పై అభిమానులు ఆసక్తి కనబరిచారు. అతడిని ఎవరు తీసుకుంటారు?ఎంత మొత్తం ధర పలుకుతాడనే విషయాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, అందరూ ఊహించినట్లే ముంబయి ఇండియన్స్ అర్జున్‌ను తన కనీస ధర రూ.20లక్షలకే తీసుకుంది. దీంతో తొలిసారి వేలంలో పాల్గొన్న అర్జున్ తెందూల్కర్ సొంతగూటికే చేరాడని అభిమానులు భావిస్తున్నారు. వేలం ముగిశాక అర్జున్ మాట్లాడిన ఓ వీడియోను ముంబయి టీమ్ తమ ట్విటర్‌లో పంచుకుంది. ‘చిన్నప్పటి నుంచీ నాకు ముంబయి జట్టంటే ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచిన కోచ్‌లకు, జట్టు యాజమాన్యానికి, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ జట్టుతో కలిసి ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అర్జున్ వెల్లడించాడు.
ఇదిలా ఉంటే ముంబయి టీమ్ యజమాని ఆకాశ్ అంబానీ సైతం ఓ వీడియోలో మాట్లాడారు. అర్జున్ నైపుణ్యాల గురించి మహేలా జయవర్ధనె, జహీర్‌ఖాన్ తమకు ముందే చెప్పారని ఆకాశ్ పేర్కొన్నారు. సచిన్ తనయుడు ఎడమచేతివాటం ఫాస్ట్‌బౌలర్, బ్యాట్స్‌మన్ అని వివరించారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలా ఎక్కువ మంది లేరని చెప్పుకొచ్చారు. ఇతర యువ ఆటగాళ్లలాగే అర్జున్ కూడా ఈ స్థాయికి చేరుకున్నాడన్నారు. ఇక తమ జట్టులో ఆటగాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి వారిలోని అత్యుత్తమ నైపుణ్యాలను బయటకు తీస్తామని తెలిపారు.
“It’s very important that his process and his progression happens as any other young cricketer.”
Akash Ambani shares his thoughts on signing Arjun Tendulkar ?️#OneFamily #MumbaiIndians #IPLAuction pic.twitter.com/qUy5lqDcKz
— Mumbai Indians (@mipaltan) February 18, 2021