Arjun Tendulkar: భవిష్యత్తుపై నీకు మస్త్ క్లారిటీ ఉంది బ్రో.. సచిన్ కొడుకు సంచలన నిర్ణయం

Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన డొమెస్టిక్ క్రికెట్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నాడు. గోవా జట్టును వీడుతున్నాడంటూ వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ, రాబోయే దేశవాళీ సీజన్‌లోనూ గోవా తరఫునే ఆడనున్నాడు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 వికెట్లు సాధించిన అర్జున్, జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

Arjun Tendulkar: భవిష్యత్తుపై నీకు మస్త్ క్లారిటీ ఉంది బ్రో.. సచిన్ కొడుకు సంచలన నిర్ణయం
Arjun Tendulkar

Updated on: Aug 22, 2026 | 9:52 AM

Arjun Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన క్రికెట్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణానికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బయటకు రావడంతో క్రీడా వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా అర్జున్ టెండూల్కర్ డొమెస్టిక్ క్రికెట్ భవిష్యత్తుపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఇటీవల గోవా క్రికెట్ జట్టు చేపట్టిన ఓమన్ పర్యటనకు 26 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ దూరం కావడంతో, అతడు గోవా జట్టును వీడి మళ్లీ ముంబై వైపు చూస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అర్జున్ రాబోయే డొమెస్టిక్ సీజన్‌లో కూడా గోవా తరఫునే బరిలోకి దిగుతాడని, జట్టులోనే కొనసాగుతాడని సదరు క్రికెట్ అసోసియేషన్ వర్గాలు స్పష్టం చేశాయి. 2022-23 సీజన్‌కు ముందు అవకాశాల కోసం అర్జున్ ముంబై నుంచి గోవాకు మారడం గమనార్హం.

గోవా తరఫున ఆల్ రౌండ్ షో

గోవా జట్టులో చేరినప్పటి నుంచి అర్జున్ ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గోవా తరఫున రెగ్యులర్ ప్లేయర్‌గా స్థానం సంపాదించుకున్న ఈ యంగ్ పేసర్, ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 50 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. రంజీ ట్రోఫీలో రాజస్థాన్‌పై ఏకంగా సెంచరీ బాది తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ గోవా జట్టులో అతడు అత్యంత కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.

ఇది కూడా చదవండి: Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా

ఇది కూడా చదవండి: Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

ఐపీఎల్ అనుభవాలు, తండ్రి సచిన్ ప్రశంసలు

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అర్జున్ ఆడాడు. సీజన్ ఆఖరి మ్యాచ్‌లో లక్నో తరఫున బరిలోకి దిగిన అర్జున్, నిలకడగా బౌలింగ్ చేస్తూ ప్రభాస్మిరన్ సింగ్‌ను అద్భుతమైన యార్కర్‌తో అవుట్ చేసి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సుదీర్ఘ కాలం బెంచ్ మీద కూర్చున్నా నిరాశ చెందకుండా ఓపికగా నిరీక్షించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తీరును తండ్రి సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఎంతగానో ప్రశంసించారు. క్రికెట్ ప్రతిభతో పాటు ఓర్పును కూడా పరీక్షస్తుందని, అర్జున్ దాన్ని చక్కగా ఎదుర్కొన్నాడని కొనియాడారు. పేరు వెనుక ఉన్న భారంతో కాకుండా తన సొంత కష్టంతో జట్టులో స్థానం సంపాదించుకునేందుకు అర్జున్ చాలా ప్రయత్నిస్తున్నాడు. రాబోయే డొమెస్టిక్ సీజన్‌లో గోవా తరఫున ఆల్‌రౌండర్‌గా మెరిసి జాతీయ జట్టు తలుపులు తట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

 

ఇది కూాడా చదవండి: ENG vs PAK: 2001 లార్డ్స్ సీన్ రిపీట్.. 25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు

ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us