INDIA VS AUSTRALIA 2020 : భారత్×ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలి నీడలు.. కారణాలు ఏంటో తెలుసా..

INDIA VS AUSTRALIA 2020 : భారత్×ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు

INDIA VS AUSTRALIA 2020 : భారత్×ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలి నీడలు.. కారణాలు ఏంటో తెలుసా..
India Vs Australia

Updated on: Jan 10, 2021 | 7:29 AM

INDIA VS AUSTRALIA 2020 : భారత్×ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం అందరూ ఊహించినట్లుగా కొత్తరకం కరోనా వైరస్ అయితే ఇప్పుడు మరో కారణం తెరపైకి వస్తోంది. ఇప్పటికే క్వీన్స్‌ల్యాండ్‌ ఆరోగ్య మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు, హోటల్లో గదిలోనే ఉండాలనే కఠిన నిబంధనలు, బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్‌ విధించడం వంటి కారణాలతో ఆఖరి టెస్టు జరుగుతుందో లేదో అనే అనుమానాలు మొదటి నుంచే ఉన్నాయి. ఇప్పడు బీసీసీఐ ఆలోచన విధానం కూడా దీనికి తోడైంది. షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లాండ్‌ సిరీస్ నిర్వహించడం కోసం బీసీసీఐ ఆఖరి టెస్టు రద్దు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది.

బ్రిస్బేన్‌లో ఇప్పటి వరకు ఒక స్ట్రెయిన్ కేసు మాత్రమే నమోదైంది. అయితే ఇండియా విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా యూకే నుంచి స్వదేశానికి వచ్చిన వారి విషయంలో కరోనా నెగెటివ్ అని తేలినా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఆఖరి టెస్టు ముగిసేలోపు అక్కడ కొత్త కరోనా కేసులు పెరిగినా.. ఆ లోపు విదేశాల నుంచి వచ్చే వారిపై భారత్‌ ప్రభుత్వం కఠిన క్వారంటైన్‌ నిబంధనలు విధించినా టీమ్‌ఇండియాకు ఇబ్బందులు తప్పవు. దీంతో స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. అలా జరిగితే ఇంగ్లాండ్‌ సిరీస్‌పై ప్రభావం పడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రద్దుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న సంగతి అందరికి తెలిసిందే.

Bank Holidays: జనవరి నెలలో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే.. ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్.