India vs Pakistan : వెర్రిమొఖం వేసిన పాకిస్తాన్.. ఇండియా vs పాక్ మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్.. నోరెళ్లబెట్టిన పీసీబీ

ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా, సల్మాన్ అలీ అగా నేతృత్వంలోని పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. అయితే, అతని నియామకం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

India vs Pakistan : వెర్రిమొఖం వేసిన పాకిస్తాన్.. ఇండియా vs పాక్ మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్.. నోరెళ్లబెట్టిన పీసీబీ
Andy Pycroft

Updated on: Sep 20, 2025 | 4:02 PM

India vs Pakistan : ఆసియా కప్ 2025లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్-4 మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ గత మ్యాచ్‌లో జరిగిన ఒక వివాదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మ్యాచ్ రిఫరీని మార్చాలని ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ పాకిస్తాన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆసియా కప్ 2025లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్నాయి. ఈ దశలో భాగంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా, సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాకిస్తాన్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనుంది. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. అయితే, అతని నియామకంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో టాస్ తర్వాత ఇద్దరు కెప్టెన్‌లు హ్యాండ్‌షేక్ చేసుకోకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అడ్డుకున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. దీనిపై పాక్ అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పైక్రాఫ్ట్ ప్రవర్తన కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఉందని, అతనిపై విచారణ జరిపి, మ్యాచ్ రిఫరీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

అయితే, ఐసీసీ పాకిస్తాన్ అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించింది. సూపర్-4 మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్టే రిఫరీగా ఉంటాడని స్పష్టం చేసింది. గతంలో జరిగిన వివాదంపై పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పాడు. ఇది కేవలం ఒక మిస్ కమ్యూనికేషన్ అని, నిర్వాహకుల సూచనల మేరకే తాను అలా చేశానని వివరించాడు.

భారత్‌తో మ్యాచ్ తర్వాత ఇరు జట్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగకపోవడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉంటే మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడింది. దాంతో పైక్రాఫ్ట్ అధికారికంగా క్షమాపణలు చెప్పాడు. అయితే, ఐసీసీ మాత్రం పాక్ అభ్యంతరాలను పట్టించుకోలేదు. పైక్రాఫ్ట్ టోర్నమెంట్ నిబంధనల ప్రకారమే వ్యవహరించారని ఐసీసీ స్పష్టం చేసింది. అతను ఏసీసీ వేదిక మేనేజర్ ఇచ్చిన సూచనలను మాత్రమే పాటించాడని, ఇందులో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఐసీసీ తెలిపింది.

ఇంకా ఐసీసీ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే యోచనలో ఉంది. పైక్రాఫ్ట్‌తో జరిగిన సమావేశాన్ని రికార్డ్ చేయడం, అలాగే పరిమిత ప్రాంతంలోకి వెళ్లడం వంటివి టోర్నమెంట్ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఐసీసీ భావిస్తోంది. ఇకపై కూడా ఇండియా-పాక్ మ్యాచ్‌లలో హ్యాండ్‌షేక్ చేసుకోకూడదనే నిబంధన అమలులో ఉంటుందని భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..