Team India: కోహ్లీ – బెయిర్ స్టో మధ్య మాటల యుద్ధం.. ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా

|

Jul 10, 2022 | 6:23 AM

ఇండియా - ఇంగ్లండ్ (India - England) ఐదో టెస్టులో విరాట్ కోహ్లీ, బెయిర్ స్టో మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆట ఆడుతున్న సమయంలో తొలి ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఒకరినొకరు....

Team India: కోహ్లీ - బెయిర్ స్టో మధ్య మాటల యుద్ధం.. ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా
Kohli Bairstow
Follow us on

ఇండియా – ఇంగ్లండ్ (India – England) ఐదో టెస్టులో విరాట్ కోహ్లీ, బెయిర్ స్టో మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆట ఆడుతున్న సమయంలో తొలి ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఒకరినొకరు మాటలు అనుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అంపైర్లు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. తాజాగా ఈ అంశంపై ఆ జట్టు ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ (James Anderson) స్పందించాడు. ఆ రోజు ఏం జరిగిందో వివరించాడు. బెయిర్‌స్టో నిలకడగా ఆడుతున్న సమయంలో కోహ్లీ అతడిని స్లెడ్జింగ్ చేశాడని చెప్పాడు. అంతే కాకుండా భోజన విరామ సమయంలో బెయిర్‌స్టో తన దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పినట్లు వివరించాడు. అయితే బెయిర్ స్టో కు కోహ్లీకి మధ్య వివాదం జరగిన అనంతరం జానీ రెచ్చిపోయాడు. బంతిని దంచికొడుతూ బౌండరీలు దాటించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జానీ బెయిర్‌స్టో (106) వద్ద ఔటయ్యాడు.

కాగా.. బెయిర్ స్టోను ఔట్ చేసిన వెంటనే కోహ్లీ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెయిర్ స్టో (Bair stow) ను ఔట్‌ చేశాక కోహ్లీ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అంతకు ముందు విరాట్ కోహ్లీ, బెయిర్ స్టో మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో అంపైర్లు కలగజేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత బెయిర్ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. దంచికొడుతూ వేగంగా శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, కాసేపటికే షమి బౌలింగ్‌లో కోహ్లీకి చిక్కాడు. దీంతో కోహ్లీ క్యాచ్‌ అందుకున్న వెంటనే ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.