Amul India: కొత్త పెళ్లి జంటకు అమూల్‌ ఎలా విషెస్‌ చెప్పిందో చూశారా.? ‘సో క్యూట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తోన్న..

|

Mar 17, 2021 | 1:16 AM

Amul Post On Bumrah Marriage: టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. టీవీ యాంకర్‌ సంజన గణేషన్‌తో కలిసి బుమ్రా ఏడడుగులు వేశాడు. గోవాలో ఇరు...

Amul India: కొత్త పెళ్లి జంటకు అమూల్‌ ఎలా విషెస్‌ చెప్పిందో చూశారా.? సో క్యూట్ అంటూ ప్రశంసలు కురిపిస్తోన్న..
Bumrah Sanjana
Follow us on

Amul Post On Bumrah Marriage: టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. టీవీ యాంకర్‌ సంజన గణేషన్‌తో కలిసి బుమ్రా ఏడడుగులు వేశాడు. గోవాలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ జంట సోమవారం తమ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇక ఈ జంటకు దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలతో పాటు, టీమిండియా ప్లేయర్స్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలో అముల్‌ ఇండియా తనదైన శైలిలో బుమ్రా, సంజనలకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భం ఏదైనా తమ ప్రొడక్ట్‌కు ప్రచారం చేస్తూనే క్రియేటివిటీని జోడిస్తూ అమూల్‌ పోస్ట్‌లు పెడుతుంటుంది. తాజాగా ఈ క్రమంలోనే అమూల్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌ వేదికగా చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సముద్రపు ఒడ్డున బుమ్రా, సంజనల కార్టూన్‌ క్యారెక్టర్‌ పాత్రలు పెళ్లి బట్టలో ఓ రాతి బండపై కూర్చొని ఉండగా.. ఇద్దరూ అమూల్‌ బటర్‌తో బ్రెడ్‌ తింటున్నట్లు ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది అమూల్‌. ఈ క్రమంలో బుమ్రా చేతిలో బాల్‌, బ్యాట్‌ ఉండగా… సంజన మైక్‌తో బుమ్రాను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ఉండడం ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫొటోపై ‘జాస్‌కి ప్రీత్‌ దొరికింది’ అని రాసున్న వ్యాఖ్యలు నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్ట్‌ చూసిన కొందరు చాలా బాగుంది అంటూ ట్వీట్‌ చేయాగా.. మరికొందరు అమూల్‌ ప్రకటనలు ఎందుకు ఇంత క్యూట్‌గా ఉంటాయి.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అమూల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌‌ పోస్ట్..

Also Read: Jasprit Bumrah wedding : టీవీ యాంకర్ తో ఏడడుగులు వేసిన పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా

ధోని ఆటను సీరియస్‌గా తీసుకుంటాడు.. నమ్మకానికే మొదటి ప్రాధాన్యత.. అందుకే కొనసాగిస్తామంటున్న..

Sachin Record: క్రికెట్‌ గాడ్‌ అద్భుత రికార్డుకు సరిగ్గా తొమ్మిదేళ్లు… కేట్‌ కట్‌ చేయించిన ప్లేయర్స్..