Ambati Rayudu: భారత్ – పాకిస్తాన్ వివాదంపై అంబటి రాయుడు వివాదాస్పద ప్రకటన.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..

India and Pakistan Border Tensions: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నాడు. రాయుడు పోస్ట్ చేసిన వెంటనే, దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ambati Rayudu: భారత్ - పాకిస్తాన్ వివాదంపై అంబటి రాయుడు వివాదాస్పద ప్రకటన.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..
Ambati Rayudu

Updated on: May 09, 2025 | 12:49 PM

India and Pakistan Border Tensions: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తత క్రికెట్‌ను కూడా ప్రభావితం చేసింది. నిన్న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన IPL 2025 మ్యాచ్ జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అకస్మాత్తుగా రద్దు చేయవలసి వచ్చింది.

ఇలాంటి సమయంలో, భారత మాజీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు ఒక ట్వీట్ ద్వారా వివాదంలో చిక్కుకున్నాడు. చాలా మంది అతని ట్వీట్‌తో ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్వీట్స్‌కు సమయం ఇది కాదని, అనవసరమంటూ కామెంట్లు చేస్తున్నరాు. దీని కారణంగా అతను సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

సరిహద్దు ఉద్రిక్తతల మధ్య అంబటి రాయుడు వివాదాస్పద పోస్ట్‌..

మ్యాచ్ రద్దు అయిన వెంటనే, రాయుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో “కంటికి కన్ను తీయడంతో ప్రపంచాన్ని అంధుడిలా మారుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ చిన్నదే అయినప్పటికీ, ప్రజలు దీనిని తీవ్రంగా పరిగణించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సున్నితమైన సమయంలో రాయుడు పరిస్థితి తీవ్రతను విస్మరించాడు, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించలేదని చాలా మంది అభిమానులు ఆరోపించారు. ధర్మశాలలోని HPCA స్టేడియం సమీపంలో డ్రోన్లు కనిపించాయని నివేదికలు వచ్చిన సమయంలో ఈ ట్వీట్ వచ్చింది. దీనివల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉన్నారు. రాయుడు ఒక సాధారణ ఆలోచనను పంచుకోవాలనుకున్నప్పటికీ, ఉద్రిక్త వాతావరణంలో అతని మాటలు చాలా మంది తప్పుగా భావించారు.

సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించిన రాయుడు వ్యాఖ్యలు..

రాయుడు పోస్ట్ చేసిన నిమిషాల్లోనే, సోషల్ మీడియా స్పందనలతో నిండిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం, నిరాశను వ్యక్తం చేయడం ప్రారంభించారు. దేశంలో జాతీయ భద్రతకు సంబంధించిన భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఆయన ఇలాంటి ప్రకటన చేయకూడదని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు.

కొంతమంది రాయుడు వాస్తవాల నుంచి దూరమైనట్లు అనిపించిందని, మరికొందరు ఇంత సున్నితమైన సమయంలో అతను అలా అనాలోచితంగా వ్యాఖ్యానించాడని విమర్శించారు. ఈ ఆగ్రహం కేవలం సామాన్యులకే పరిమితం కాలేదు, కొంతమంది ప్రముఖులు కూడా రాయుడిని విమర్శించారు. దీనిని అనవసరమైన, రెచ్చగొట్టే ప్రకటనగా అభివర్ణించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..