
Akshay Kumar: లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. ఇరు జట్ల అభిమానులు ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో లార్డ్స్‌లో భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఇందులో సాధారణ అభిమానులే కాదు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ప్రత్యేకత ఏమిటంటే అక్షయ్ కుమార్ ఒంటరిగా లేడు, ఒక బాలీవుడ్ నటి కూడా అతనితో ఉంది. దీంతో వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సోమవారం, జులై 14 లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లోని మూడవ మ్యాచ్ చివరి రోజు. టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. ప్రస్తుతం భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఇంకా 70 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ విజయానికి మరో 2 వికెట్లు తీయాల్సి ఉంది.
అక్షయ్ కుమార్ ఫొటో టీవీ స్క్రీన్‌పై కనిపించగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆయన టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కూర్చుని ఉన్నాడు. ఆ పక్కనే బాలీవుడ్ నటి కూడా కనిపించింది. ఈ ఫొటో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, చాలామంది ఈ నటిని గుర్తించలేకపోయారు. అక్షయ్ ఏ నటితో లార్డ్స్ టెస్ట్ చూడటానికి వచ్చాడనే ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అక్షయ్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు.
King is Here 💥#AkshayKumar pic.twitter.com/ooVlGsa4CK
— VIKRAM™ (@Ak_vikram12) July 14, 2025
అయితే, కొంతమంది అభిమానులు అక్షయ్ కుమార్ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి రావడం ఇష్టపడలేదు. బాలీవుడ్ స్టార్ ఉండటం వల్ల టీం ఇండియా ఓటమి ఖాయమని సోషల్ మీడియాలో రాసుకొస్తు్న్నారు. ఈ క్రమంలో వినియోగదారులు అక్షయ్ పాత ఫొటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. అవి 2021 టీ20 ప్రపంచ కప్ నుంచి తీసుకున్నవి. ఈ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో పాకిస్తాన్ టీం ఇండియాను ఓడించింది. ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్ భారతదేశంపై గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..