IND vs WI: రోహిత్‌కు షాకివ్వనున్న బీసీసీఐ.. విండీస్ పర్యటనకు కెప్టెన్‌గా అజింక్యా రహానే.. ఎందుకంటే?

|

Jun 17, 2023 | 7:23 AM

India Tour of West Indies: వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది. జులై 12 నుంచి డొమినిక్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. రెండో టెస్టు ట్రినిడాడ్‌లో జరగనుంది.

IND vs WI: రోహిత్‌కు షాకివ్వనున్న బీసీసీఐ.. విండీస్ పర్యటనకు కెప్టెన్‌గా అజింక్యా రహానే.. ఎందుకంటే?
Rohit Sharma
Follow us on

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నిరాశతో వెనుదిరిగిన భారత జట్టు.. ప్రస్తుతం విశ్రాంతిలో ఉంది. అయితే, వచ్చే నెలలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టెస్టులతో పాటు వన్డే, టీ20 సిరీస్‌లు ఇరుజట్లు ఆడనున్నాయి. ఈ టెస్ట్ సిరీస్‌తో, టీమ్ ఇండియా తన తదుపరి టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ను ప్రారంభించనుంది. అయితే ఈ పర్యటనలో రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్‌ల్లో కనిపించకపోవచ్చు. ఆయనకు విశ్రాంతి ఇవ్వవచ్చని అంటున్నారు.

జూన్ 27న వెస్టిండీస్ టూర్‌కు టీం ఇండియా ఎంపిక?

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది. జులై 12 నుంచి డొమినిక్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. రెండో టెస్టు ట్రినిడాడ్‌లో జరగనుంది.

రోహిత్‌కి రెస్ట్, రహానేకి సారథ్యం..

ఇంగ్లీష్ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ పర్యటనలో కొన్ని మ్యాచ్‌లలో రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చిని తెలుస్తోంది. ఐపీఎల్, టెస్ట్ ఛాంపియన్‌షిప్ సమయంలో రోహిత్ అలసిపోయినట్లు కనిపించాడంట. కాబట్టి సెలక్టర్లు అతనికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నారంట. అందువల్ల వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వవచ్చని వార్తాపత్రిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో సెలక్టర్లు రోహిత్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని నివేదికలో రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

టెస్టులో రోహిత్‌కు విశ్రాంతినిస్తే.. ఇటీవలే జట్టులోకి వచ్చిన రహానేని కెప్టెన్‌గా నియమించవచ్చని కూడా నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే రహానే టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, పేలవమైన ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి జట్టును హ్యాండిల్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతని బ్యాట్‌ నుంచి 43 పరుగులు వచ్చాయి.

పుజారా పరిస్థితి?

టీమిండియా బ్యాటింగ్‌కు ఇరుసుగా భావించే చెతేశ్వర్ పుజారా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విఫలమయ్యాడు. జట్టులో అతని స్థానం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. అయితే రోహిత్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తే పుజారాకు మరో అవకాశం లభిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..