Video: బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. తొలిసారి సెమీస్ చేరిన ఆఫ్గాన్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..

Afghanistan vs Bangladesh: ICC T-20 వరల్డ్ కప్ 2024 సూపర్-8 దశ చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో సెమీస్ రేసులోకి ఆఫ్ఘానిస్తాన్ చేరింది. ఆఫ్ఘాన్ విజయంతో ఆస్ట్రేలియా కూడా టీ20 ప్రపంచకప్ 2024 నుంచి తప్పుకుంది.

Video: బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. తొలిసారి సెమీస్ చేరిన ఆఫ్గాన్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
Afg Vs Ban Result

Updated on: Jun 25, 2024 | 10:55 AM

Afghanistan vs Bangladesh, T20 World Cup 2024: వెస్టిండీస్‌లోని సెయింట్ విసెంటే స్టేడియంలో రషీద్ ఖాన్ సారథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌ను ఓడించి ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ఆఫ్ఘనిస్థాన్ విజయంతో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న ఆస్ట్రేలియా ఆశలకు తెరపడింది. తక్కువ రన్ రేట్ కారణంగా కంగారూ జట్టు ప్రపంచకప్‌‌నకు దూరమైంది.

టాస్ గెలిచిన రషీద్ ఖాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెహ్మానుల్లా గుర్ప్‌బాజ్ 43 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆఫ్ఘనిస్తాన్ 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ జట్టు 105 పరుగులకే ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్ 18వ ఓవర్లో వరుసగా 2 వికెట్లు తీసి జట్టును ఆలౌట్ చేశాడు. 54 పరుగులు చేసిన లిటన్ దాస్ ఒక ఎండ్‌లో నిలవగా, మరో ఎండ్‌ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. దీంతో బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

రెండు జట్ల ప్లేయింగ్ XI ..

ఆఫ్ఘనిస్థాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికె), ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, కరీం జనత్, నంగేలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూకీ.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజీద్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..