ఆఫ్ఘన్ కమాల్.. భారత్ ఢమాల్!

|

Jun 22, 2019 | 6:55 PM

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంఫ్టన్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. పసికూన ఆఫ్ఘన్ పై భారత్ భారీ స్కోర్ చేస్తుందనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పాలి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(67), కేదార్ జాదవ్(52) మాత్రమే రాణించారు. అటు ఆఫ్ఘన్ బౌలర్లలో నైబ్, నబీ రెండేసి వికెట్లు తీయగా.. రహ్మాన్, ఆలమ్, రషీద్, […]

ఆఫ్ఘన్ కమాల్.. భారత్ ఢమాల్!
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంఫ్టన్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. పసికూన ఆఫ్ఘన్ పై భారత్ భారీ స్కోర్ చేస్తుందనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పాలి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(67), కేదార్ జాదవ్(52) మాత్రమే రాణించారు. అటు ఆఫ్ఘన్ బౌలర్లలో నైబ్, నబీ రెండేసి వికెట్లు తీయగా.. రహ్మాన్, ఆలమ్, రషీద్, రహ్మత్ చెరో వికెట్ పడగొట్టారు.