
Afghanistan vs Sri Lanka Playing 11: లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆసియా కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక మధ్య జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో సూపర్-4 రేసు ఉత్కంఠగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ తేడాతో ఓడించి బంగ్లాదేశ్ సూపర్-4కు అర్హత సాధించింది. ఇప్పుడు గ్రూప్-బిలో ఒకే జట్టు మిగిలి ఉంది. దీని కోసం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌తో పోటీ పడనుంది. ఆసియా కప్‌లో శ్రీలంకకు ఇది రెండో మ్యాచ్.
తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా, అఫ్గానిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే, అఫ్గానిస్థాన్‌పై వరుసగా మూడో వన్డే విజయం శ్రీలంకకు దక్కుతుంది. రెండు జట్లు చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో ODI ఫార్మాట్‌లో తలపడ్డాయి. శ్రీలంక మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.
శ్రీలంక తన చివరి 11 వన్డే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే శ్రీలంక వరుసగా 12 విజయాలు అందుకుంటుంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ తన చివరి ఐదు వన్డేల్లో ఓడిపోయింది.
ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 10 వన్డేల్లో తలపడ్డాయి. శ్రీలంక 6, ఆఫ్ఘనిస్థాన్ 3 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు. 2014 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ తొలిసారి పాల్గొంది. ఆసియా కప్‌లో వన్డే ఫార్మాట్‌లో ఇరుజట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరిగాయి. ఒకదానిలో ఆఫ్ఘనిస్థాన్ గెలుపొందగా, మరొకటి శ్రీలంక గెలిచింది.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..