AFG vs AUS: వర్షంతో మ్యాచ్ రద్దు.. కట్‌చేస్తే.. సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

AFG vs AUS, ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో 10వ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఆట ఆగిపోయే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేసింది. ట్రావిస్ హెడ్ యాభై పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతనికి మద్దతు ఇస్తున్నాడు. వీరిద్దరి మధ్య 65 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది.

AFG vs AUS: వర్షంతో మ్యాచ్ రద్దు.. కట్‌చేస్తే.. సెమీస్ చేరిన ఆస్ట్రేలియా
Australia

Updated on: Feb 28, 2025 | 9:36 PM

AFG vs AUS, ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. దీనితో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో, శనివారం కరాచీలో జరగనున్న ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఆశలు పెట్టుకుంది.

శుక్రవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదికుల్లా అటల్ 85 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులు చేశారు. బెన్ ద్వార్షిస్ 3 వికెట్లు పడగొట్టాడు.

274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. తరువాత వర్షం పడటం మొదలైంది. ఆటను ఆపవలసి వచ్చింది. ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 59 పరుగులు, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (wk), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..