Womens BigBash League: క్యాచస్ విన్ మ్యాచస్ అనే నానుడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అద్భుత క్యాచులతో మ్యాచులను గెలిపించిన ఎందరో ఫీల్డర్లను మనం చూస్తూనే ఉన్నాం. క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి క్యాచులు విజేతలుగా నిలిపిన మ్యాచులను చూశాం. పురుషులు, మహిళల క్రికెట్‌లో ఈ మధ్య ఎన్నో థ్రిల్లింగ్ క్యాచులను చూస్తున్నాం. అవి నెట్టింట్లోనూ తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ క్యాచ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఫీల్డర్ పట్టిన ఓ క్యాచ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బ్యాట్స్ ఉమెన్ కొట్టిన బంతిని ఓ ఫీల్డర్ బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగిరి కాలి మునివేళ్లతో నిలుచుని అద్భుతంగా క్యాచ్ పట్టింది. ఈ క్రమంలో పట్టు తప్పినా.. క్యాచ్ పట్టిన బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి, మరలా మైదానంలోకి చేరుకుని ఆ బంతిని పట్టుకుంది. ఈ వైరల్ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమె సమయస్ఫూర్తిని అంతా మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే శనివారం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ తలపడ్డాయి. ఛేదనలో సిడ్నీ థండర్స్ టీం 19వ ఓవర్‌లో ఇసాబెల్లె వాంగ్ (6) బ్యాటింగ్ చేస్తుంది. ఈ ఓవర్లో నాలుగో బంతిని డీప్‌మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచేందుకు ట్రై చేసింది. గాల్లోకి లేచిన బంతిని అడిలైడ్ ఫీల్డర్ బ్రిడ్జెట్ పాటర్సన్ అంతర్నీ అశ్చర్యపరుస్తూ క్యాచ్ అందుకుంది. ఈ మ్యాచ్‌లో అడిలైడ్ టీం 30 పరుగుల తేడాతో గెలిచింది.
Bridget Patterson walks the boundary tightrope – and catches a classic! #OhWhatAFeeling | @Toyota_Aus | #WBBL07 pic.twitter.com/C7FzpZket6
— cricket.com.au (@cricketcomau) October 16, 2021
Also Read: T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ ఫుల్ టైం టేబుల్, మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మీకోసం..!